Begin typing your search above and press return to search.

పవన్.. మెర్సాల్ కావాలమ్మా!!

By:  Tupaki Desk   |   21 Oct 2017 1:10 PM GMT
పవన్.. మెర్సాల్ కావాలమ్మా!!
X
తమిళ సినిమా 'మెర్సాల్' చూడగానే ఒక్క విషయం చాలా క్లియర్ గా అర్ధమైపోతోంది. అదేంటంటే.. ఆ సినిమాలోని డైలాగులు అన్నీ కూడా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి అనుగుణంగా రచించారు. ఏ సీన్లో చూసుకున్నా కూడా మనోడు ఆ డైలాగులుతో చింపేశాడు. ఇలాంటి డైలాగులు స్ర్కీన్ మీద చెప్పేసి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే కత్తిలా ఉంటుందనేది విశ్లేషకుల అంచనా.

నిజానికి గతంలో సర్దార్ పాపారాయుడు వంటి సినిమాల్లో అలాంటి డైలాగులు పేల్చాకనే ఎన్టీఆర్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో ఆయనకు అది చాలా ప్లస్ అయ్యింది. అయితే కామెడీ సినిమా అయిన శంకర్ దాదా జిందాబాద్ వంటివి చేసేసి రాజీకీయాల్లోకి వచ్చిన చిరంజీవి.. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. అందుకే రజనీకాంత్ కూడా తరచూ తన సినిమాల్లో పొలిటికల్ పంచులు పెడుతుంటారు. అయితే ఇప్పుడు మెర్సాల్ విషయంలో విజయ్ మాత్రం.. ఏ కమ్యూనిటీనీ ఏ ఏజ్ గ్రూపునూ వదిలిపెట్టకుండా.. అందరినీ బుట్టలో వేసుకోవడానికి డైలాగులు వేశాడు. 'అన్న' అని పిలిచిన అమ్మాయిని 'అమ్మా' అని పిలిచి.. నేను నీకు అన్నయ్యను అంటే నువ్వు నాకు తల్లితో సమానం అంటూ కౌంటర్లు చెప్పి.. భలే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా ఇప్పుడు విజయ్ ని అభిమానించే వారికి తెగ నచ్చేస్తోంది.

నిజానికి పవన్ కూడా మెర్సాల్ తరహా సినిమాలను చేసి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది కాని.. కామెడీ సినిమాలను చేస్తే ఇస్తే మాత్రం పెద్దగా కిక్ ఉండకపోవచ్చు అంటూ కొందరు సినీ రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మరి ఇవన్నీ పవన్ కు నచ్చుతాయా? అలాంటివి చేస్తాడా? లేదంటే కామెడీ సినిమాలు చేసుకుంటూ సింపుల్ గా మళ్ళీ చంద్రబాబు భజనే చేస్తాడా? ఏమో చూద్దాం.