Begin typing your search above and press return to search.

పవన్‌ ఏంటి ఇలా హ్యాండిచ్చాడు?

By:  Tupaki Desk   |   1 Sep 2015 5:46 PM GMT
పవన్‌ ఏంటి ఇలా హ్యాండిచ్చాడు?
X
అన్నయ్య పుట్టినరోజు ఘనం. తమ్ముడెలా చేసుకుంటాడో? అంటూ మెగాభిమానులంతా ఎంతో ఎగ్జయిటింగ్‌ గా వెయిట్‌ చేస్తున్నారు. సరిగ్గా అలాంటి టైమ్‌ లో పవన్‌ బృందం నుంచి ఓ షాకింగ్‌ న్యూస్‌. సెప్లెంబర్‌ 2 (రేపు) పుట్టినరోజు వేడుకలు ఆన్‌ సెట్స్‌ లోనే. ఈసారి 43వ పుట్టినరోజు చాలా సాదాసీదాగా సెట్‌ లోనే. దానికోసం హైదరాబాద్‌ లో పందిళ్లు వేసి పండుగలా చేసేది లేనేలేదు అని తేల్చి చెప్పేశారు.

ఇప్పటికే పవన్‌ హైదరాబాద్‌ వదిలేసి ఎక్కడో సుదూర తీరానికి చేరిపోయారు. అక్కడ షూటింగ్‌ పూర్తి చేసుకుని తిరిగి 4వ తేదీన హైదరాబాద్‌ వస్తారుట. ఈ సంగతి పవన్‌ కి అత్యంత సన్నిహితుల నుంచి బైటికి తెలిసింది. అరే అయినా ఏంటి పవన్‌ జీ.. ఇలా చేశారు? మీ అభిమానులంతా బోలడంత ఎగ్జయిట్‌ మెంట్‌ తో ఉన్నారు. ఇంతలోనే ఇలా హ్యాండిచ్చారేంటి? పుట్టినరోజున సర్ధార్‌ జీ ట్రైలర్‌ వచ్చేస్తుంది. అభిమానుల సమక్షంలోనే మీరు ఉంటారు? అనుకుంటే ఇలా చేశారేంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్‌.

ఇక ఎలానూ అభిమానులే ఇక్కడ ఉండి ఆ వేడుక కాస్తా జరిపించేస్తారు. ఎవరికి వారు సెలబ్రేషన్స్‌ చేసుకుని సందడి చేస్తారు. కాకపోతే పుట్టినరోజున కనీసం 'సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌' ట్రైలర్‌ వచ్చేస్తే బావుంటుందనేదే విన్నపం. అదొక్కటే 1000 వాట్‌ ఎనర్జీని అభిమానిలోకి పంప్‌ చేస్తుంది.