Begin typing your search above and press return to search.

రాయుడి కోసం పవన్ మాట్లాడనట్లే

By:  Tupaki Desk   |   24 March 2017 4:44 AM GMT
రాయుడి కోసం పవన్ మాట్లాడనట్లే
X
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు రిలీజ్ ఇవాళే. ఇప్పటికే చాలా చోట్ల షోస్ పడడంతో పవన్ ఫ్యాన్స్ మాంచి ఊపు మీదున్నారు. కాటమరాయుడు మూవీ పవన్ వన్ మ్యాన్ అనడం.. హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ సూపర్బ్ గా ఉన్నాయనే టాక్.. ఇప్పటికే మూవీపై ఉన్న హైప్ ను మరింతగా పెంచేస్తోంది.

అయితే.. కాటమరాయుడు విషయంలో పవన్ ఓ స్ట్రాంగ్ డెసిషన్ కి వచ్చేశాడట. గతంలో ఎప్పుడూ పవన్ కళ్యాణ్ తన సినిమాలను ప్రమోట్ చేయలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో మాత్రం హిందీ మీడియాకి రిలీజ్ కి ముందు ఇంటర్వ్యూ ఇవ్వడం.. ఇక్కడ మీడియా విమర్శించడంతో.. విడుదల తర్వాత ఇక్కడ మీడియాకి కూడా పలు ఇంటర్వ్యూలిచ్చాడు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అంతా అనుకున్నారు కానీ.. పవర్ స్టార్ మళ్లీ తన పంథాలోకి వెళ్లిపోయాడు. కాటమరాయుడు చిత్రానికి పవన్ తరఫు నుంచి రిలీజ్ కి ముందు ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు. కనీసం విడుదలయ్యాక అయినా.. రెండు ముక్కలు ఏదో ఒకటి చెబుతాడనే ఆశలపై కూడా ఇప్పుడు నీళ్లు చల్లేసినట్లే.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ' ఏ సినిమా అయినా కష్టపడి చేస్తాను. ఇది కూడా అంతే. మీకు నచ్చితే చూడండి.. లేకపోతే మీరిచ్చే తీర్పు మీ ఇష్టం' అని చెప్పిన పవన్.. ఇప్పుడు కూడా ఆ మాటకే కట్టుబడి ఉన్నాడట. తన సినిమా చూడమంటూ ఒక్క మాట కూడా చెప్పబోడట పవర్ స్టార్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/