Begin typing your search above and press return to search.

పుట్టిన రోజైనా పవన్ మారడుగా!!

By:  Tupaki Desk   |   31 Aug 2016 7:30 PM GMT
పుట్టిన రోజైనా పవన్ మారడుగా!!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద పండగ వచ్చేస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కావడంతో.. రెండు రాష్ట్రాల్లో సంబరాలు చేసేసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటాడనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన పవన్.. తను ప్రారంభించిన జన సేనను యాక్టివ్ చేయనున్నట్లు.. పార్టీ తరఫున కార్యకలాపాల కోసం పనులు ప్రారంభించబోతున్నట్లు చెప్పేశాడు.

దీంతో ఈసారి బర్త్ డేకి ఫ్యాన్స్ తోను.. పార్టీకి సంబంధించిన మనుషుల తోను పవన్ గడుపుతాడని.. అందరికీ ఉత్సాహం ఇస్తాడనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ బర్త్ డేకి కూడా అలాంటి హంగామా ఏమీ ఉండదని తెలుస్తోంది. యథావిధిగానే తన పుట్టిన రోజున సెలబ్రేషన్స్ కే కాదు.. రాజకీయ సినిమా సంబంధింత జనాలకు దూరంగా గడిపేయనున్నాడట పవన్ కళ్యాణ్. అంతే కాదు.. ఇప్పటికే సెలబ్రేషన్స్ కోసం ఏర్పాటు చేసుకున్నవాళ్లకు కూడా పవన్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వెళ్లాయని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ తీయనున్న నిర్మాత ఎస్ రాధాకృష్ణ.. సెప్టెంబర్ 2నే ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలని భావిస్తే.. ఆ ఆశలపై కూడా పవన్ నీళ్లు చల్లేశాడట. మొత్తం మీద ఈసారి కూడా పవన్ సందడి లేకుండానే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే జరగనుందన్న మాట.