Begin typing your search above and press return to search.

నాలుగు నెలలకే మొదలెడుతున్న పవన్!!

By:  Tupaki Desk   |   23 July 2016 1:30 PM GMT
నాలుగు నెలలకే మొదలెడుతున్న పవన్!!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా.. ప్రతీ సినిమాకి పెద్ద పెద్ద బ్రేకులు ఇస్తూ ఉంటాడు. తను మామూలుగా తీసుకునే బ్రేక్స్ కి తోడు.. ప్రీ ప్రొడక్షన్ పేరుతో కూడా తెగ లేట్ చేసేస్తాడు. సర్దార్ లాంటి సినిమాకి కూడా ఏళ్లకేళ్లు గడిపేశాడంటే పవన్ తో పని ఎంత స్లోగా ఉంటుందో అర్ధమవుతుంది. సర్దార్ తర్వాత మాత్రం పవన్ ఎందుకో రూట్ మార్చాడని అనిపిస్తోంది.

ఏప్రిల్ లో రిలీజైన సర్దార్‌ సినిమా తరువాత.. కేవలం నాలుగు నెలలకే కొత్త మూవీ మొదలుపెట్టేస్తున్నాడు పవన్‌. ఈ సినిమాలో నటించే హీరోయిన్ శృతిహాసన్ అని ఇప్పటికే ఫైనల్ చేసిన నిర్మాత శరత్ మరార్.. ఇప్పుడు కొత్త అప్ డేట్ చెప్పాడు. ఆగస్ట్ 6 నుంచి పవన్ కళ్యాణ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ కానుందని ప్రొడ్యూసర్ అనౌన్స్ చేయడంతో.. పవన్ ఫ్యాన్స్ లో ఆనందం మొదలైపోయింది. మొత్తానికి సర్దార్ సినిమా కోసం రెండు సంవత్సరాలు తీసుకున్నట్లు ఇప్పుడు కూడా అలాంటి ప్రీ ప్రొడక్షన్‌ ఏమన్నా చేస్తాడేమో అని కంగారుపడ్డారు అభిమానులు. అలాగే ఎస్.జె.సూర్య వాకౌట్‌ చేశాడనగానే ఈ భయం ఇంకా ఎక్కువైంది. కాని ఇప్పుడు మాత్రం పవన్ అన్ని భయాలకు తెర దించేశాడులే.

ఇకపోతే ఈ సినిమాను గోపాల గోపాల ఫేం డాలీ డైరక్టు చేస్తున్న సంగతి తెలిసిందే.