Begin typing your search above and press return to search.

గౌతమ్ నంద.. ఇంకో పవన్ లింకు

By:  Tupaki Desk   |   27 July 2017 11:30 AM GMT
గౌతమ్ నంద.. ఇంకో పవన్ లింకు
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం చిక్కినట్లే చిక్కి చేజారింది సంపత్ నందికి. ‘గబ్బర్ సింగ్-2’ కోసమని అతను దాదాపు రెండేళ్లు సమయం వెచ్చించాడు. ఐతే కొన్ని కారణాల వల్ల సంపత్ ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేయాల్సి వచ్చింది. ‘రచ్చ’ లాంటి సూపర్ హిట్ తర్వాత రెండేళ్ల సమయం ఇలా వృథా కావడం సంపత్ కెరీర్ కు పెద్ద ప్రతికూలతే. అయితే పవన్ వల్ల అంత ఇబ్బంది పడ్డప్పటికీ సంపత్.. ఎప్పుడూ తన అభిమాన హీరో గురించి నోరు జారింది లేదు. పైగా పవన్ గురించి ఎప్పుడూ పాజిటివ్ గానే మాట్లాడతాడు. తన సినిమాల్లో పవన్ రెఫరెన్సుల్ని సందర్భానుసారం ఉపయోగించి పవర్ స్టార్ మీద తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు కూడా సంపత్.

‘గబ్బర్ సింగ్-2’ ఛాన్స్ మిస్సయ్యాక చేసిన ‘బెంగాల్ టైగర్’లో పవన్ రెఫెన్సులు చూడొచ్చు. ఇక తన లేటెస్ట్ మూవీకి టైటిల్ గా పెట్టుకున్న ‘గౌతమ్ నంద’.. ‘అత్తారింటికి దారేది’లో పవన్ పాత్ర పేరు నుంచి తీసుకున్నదన్న సంగతి తెలిసిందే. ఇంకా సినిమాలోనూ పవన్ రెఫరెన్సులు ఉంటాయని అంటున్నారు. అలాగే హీరో గోపీచంద్ కు లుక్ పరంగా మేకోవర్ విషయంలోనూ పవన్ లింకు ఉందట. ‘గోపాల గోపాల’ దగ్గర్నుంచి పవన్ కు మేకప్ మ్యాన్ గా పని చేస్తున్న రామ్ తోనే గోపీకి కూడా మేకప్ చేయించారట. ‘గౌతమ్ నంద’ మీద జనాల దృష్టిమళ్లడానికి.. ఈ సినిమాపై ముందుగా జనాలకు ఆసక్తి కలగడానికి ‘గౌతమ్ నంద’ అనే టైటిల్.. గోపీచంద్ న్యూ లుక్ ప్రధాన కారణాలు. మొత్తానికి తన అభిమాన కథానాయకుడి పేరును సంపత్.. తన సినిమాల కోసం బాగానే వాడుకుంటున్నాడన్నమాట.