Begin typing your search above and press return to search.

ఇదిగో... గెడ్డం గీసుకొన్న సింహం!

By:  Tupaki Desk   |   1 Aug 2015 6:47 AM GMT
ఇదిగో... గెడ్డం గీసుకొన్న సింహం!
X
`నేనూ సింహం లాంటోడిని. అది గెడ్డం గీసుకోదు, నేను గీసుకొంటా. అంతే తేడా...` అంటూ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ `అత్తారింటికి దారేది`లో ఓ డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ డెలివ‌రీ చూసి ప‌వ‌న్ నిజంగా సింహంలాంటోడే అన్నారు అభిమానులు. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ త‌న డైలాగ్‌ కి భిన్నంగా తాను కూడా సింహంలాగే గెడ్డం గీసుకోకుండా వ‌దిలేశారు. దీంతో గుబురు గెడ్డంతో ఓ మ‌హ‌ర్షిని త‌ల‌పించారు ప‌వ‌న్‌. `గ‌బ్బ‌ర్‌ సింగ్‌` సీక్వెల్ మొద‌ల‌వుతున్నా త‌న గెడ్డం మాత్రం గీసుకోలేదు.

మ‌ళ్లీ మునుప‌టి స్మార్ట్ ప‌వ‌న్‌ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తూ వ‌చ్చారు అభిమానులు. వేరే స‌మయంలోనే అయ్యుంటే ప‌వ‌న్ `సినిమాకోస‌మే గెడ్డం పెంచాడు` అనుకొనే వాళ్లు. కానీ గ‌బ్బ‌ర్‌ సింగ్ సీక్వెలే చేయాల్సి ఉంది కాబ‌ట్టి, పోలీసు పాత్ర కోసం ప‌వ‌న్ మ‌ళ్లీ మునుప‌టిలా స్మార్ట్‌ గా క‌నిపించాల్సి వుంటుంద‌ని తెలుసుకొన్న అభిమానులు ఆయ‌న ఓల్డ్ లుక్ కోసం ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఆ ఎదురు చూపులు ఎట్ట‌కేల‌కు ఫ‌లించాయి. గ‌బ్బ‌ర్‌ సింగ్ సీక్వెల్ `స‌ర్దార్‌` ఇటీవ‌లే మొద‌లైంది. ఆ సెట్లోకి ప‌వ‌న్ గెడ్డం గీసేసి అడుగుపెట్టాడు. మునుప‌టికంటే ఇప్పుడు మ‌రింత స్మార్ట్‌ గా క‌నిపిస్తున్నాడు. సెట్లో ద‌ర్శ‌కుడు బాబి ప‌వ‌న్‌ తో క‌లిసి ఓ ఫొటో తీయించుకొన్నాడు. అదే ఇది. ప‌వ‌న్ లుక్ అదిరిపోయింది కదూ! అన్న‌ట్టు అభిమానుల‌కోసం నిన్న‌నే ఓ స్టిల్ వ‌దిలాడు ప‌వ‌న్‌. ఈ నెల‌లో అన్న‌య్య చిరంజీవి బ‌ర్త్‌ డే ని పుర‌స్క‌రించుకొని `స‌ర్దార్‌` టీజ‌ర్ వ‌దిలే అవ‌కాశ‌ముంద‌ని సమాచారం.