పవన్ కొత్త లుక్ ఇలా ఉందేంటబ్బా?

Sun Sep 24 2017 17:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ హీరోలలో ఒక్కొక్కరిది ఒక్కో హెయిర్ స్టైల్.  హీరోలకు ఉన్న గ్లామర్ కు హెయిర్ స్టైల్ తోడై వారు మరింత ఆకర్షణీయంగా కనబడేట్లు చేస్తుంది. కొన్ని సినిమాల కోసం వారు హెయిర్ స్టైల్ పై ప్రయోగాలు చేసి విఫలమైన సందర్భాలూ ఉన్నాయి. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొందరు హీరోలు తమ హెయిర్ స్టైల్ ను మీసకట్టును పక్కాగా మెయింటెన్ చేస్తుంటారు. యువ సామ్రాట్ నాగార్జున ఇంతవరకు మీసాలు తీసేసి ఎప్పుడూ కనిపించలేదు. కొద్ది రోజుల క్రితం ఆయన మీసకట్టు లేకుండా క్లీన్ షేవ్ తో దర్శనమిచ్చారు. తన హెయిర్ స్టైలిస్ట్ డిఫరెంట్ లుక్ కోసం ట్రై చేసి ఫెయిల్ అవడంతోనే నాగ్ అలా మీసం లేకుండా కనిపించారని టాలీవుడ్ టాక్. తాజాగా జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన హెయిర్ స్టైల్ ను మార్చారు. కొద్ది కాలంగా తన హెయిర్ స్టైల్ ను ఒకేలా మెయింటెన్ చేస్తున్నారు. ఆ లుక్ లోనే ఆయన చాలా గ్లామరస్ గా ఉండడంతో అదే హెయిర్ స్టైల్ ను కంటిన్యూ చేస్తున్నారు. అయితే తాజాగా మీడియా ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ సరికొత్త హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చారు. మారిన హెయిర్ స్టైల్ తో పవన్ లుక్ బాగోలేదని టాక్ వినిపిస్తోంది.కొంతకాలం నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన 25 వ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఆ సినిమా షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లిన పవన్ కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. వైజాగ్ లోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ) అంశంపై స్పందించడానికి పవన్ మీడియా ముందుకు వచ్చారు. అయితే ఆ సమయంలో పవన్ హెయిర్ స్టైల్ గతంలో కన్నా చాలా భిన్నంగా ఉంది. కొత్త లుక్ లో పవన్ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అయితే ఈ హెయిర్ స్టైల్ వల్ల పవన్ కు ఇంతకముందు ఉండే స్టైలిష్ లుక్ రాలేదనే టాక్ వినిపిస్తోంది. పొడుగ్గా ఉండే నుదుటిపై పడుతూ ఉండే పవన్ హెయిర్ను షార్ట్ చేసినట్లుంది. జెల్ రాసిన హెయిర్ ను పూర్తిగా వెనక్కి దువ్వేసినట్లుంది. ఈ లుక్ లో పవన్ కొద్దిగా ఏజ్డ్ పర్సన్ లా కనిపిస్తున్నారు. గతంలో పవన్ మీడియా సమావేశాల్లో మాట్లాడేటపుడు నుదుటి పై పడుతున్న జుట్టును చేతులతో పదే పదే వెనక్కి దువ్వేవారు. ఆ దువ్వడంలో కూడా పవన్ స్టైల్ మిస్సయ్యేది కాదు.అయితే తాజా హెయిర్ స్టైల్ తో ఆ అవసరం లేకుండా పోయింది. అయితే ఈ లుక్ లో పాత గ్లామరస్ పవన్ కనబడడం లేదని టాక్ వచ్చింది. అయితే తన 25 వ సినిమా కోసం ఈ కొత్త హెయిర్ స్టైల్ లో పవన్ కనిపించారా? లేదంటే ఈ హెయిర్ స్టైల్ ను ట్రై చేద్దామనుకున్నారా? అన్న సంగతి తెలియడం లేదు. మొత్తానికి ఈ సరికొత్త లుక్ లో పవన్ బాగోలేరని పలువురు అభిప్రాయపడుతున్నారు.