Begin typing your search above and press return to search.

లుక్స్ తో షాక్ ఇచ్చిన పవన్

By:  Tupaki Desk   |   23 April 2017 4:24 AM GMT
లుక్స్ తో షాక్ ఇచ్చిన పవన్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వయసు ఇప్పుడు 45 సంవత్సరాలు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాజ్యం చేస్తున్నా.. ఇప్పటివరకూ పవన్ వయసు గురించి చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. ఇందుకు కారణం.. లేట్ గా ఎంట్రీ ఇచ్చినా పవన్ ఎప్పుడూ యూత్ ఐకాన్ గానే నిలిచాడు. పవనిజం అంటూ పవన్ ఫ్యాన్స్ కొత్త మతం రేంజ్ లో ఫాలో అయిపోయారంటే.. అదీ పవన్ పవర్.

చాలా కాలంగా పవన్ లుక్స్ లో ఎలాంటి వేరియేషన్ లేదు. ఇందుకు పవన్ ఫిజికల్ ఫిట్నెస్ కారణం. కుంగ్ ఫూ.. తైక్వాండో.. కరాటే లాంటి పలు యుద్ధ విద్యలను ప్రాక్టీస్ చేసే పవన్.. ఫిట్ గా ఉండడానికి ప్రాధాన్యం ఇస్తాడు. కానీ ఈ మధ్య పవన్ లుక్ లో తేడాలు కనిపిస్తున్నాయి. కాటమరాయుడులో కూడా కొంచెం ఒళ్లు చేసి కనిపించాడు కానీ.. అది ఏజ్డ్ కేరక్టర్ కావడంతో.. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ మూవీలో పవన్ చేస్తున్నది యూత్ కేరక్టర్. కానీ ఇందుకు తగినట్లుగా ఇప్పుడు పవర్ స్టార్ ఫిజిక్ లేదనే విషయం లీక్ అయిపోయింది.

తాజాగా బాగా ఓ సెలూన్ ఓపెనింగ్ కి హాజరయ్యాడు పవన్. మొహం బాగా ఉబ్బిపోయి.. బుగ్గలు ఉబ్బెత్తుగా మారిపోయి.. పెరిగిన పొట్టతో.. పవన్ ను చూడడం అభిమానులకు కాసింత ఇబ్బంది కలిగించే విషయమే. రాజకీయాల్లో పడిపోయి.. ఫిజిక్ గురించి.. ఫిట్నెస్ గురించి పవన్ పట్టించుకోవడం మానేశాడనే అనుమానం తలెత్తడంలో తప్పేమీ లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/