పవన్ క్లారిటీ: నో సినిమా

Tue Nov 20 2018 17:10:26 GMT+0530 (IST)

నిన్నటి నుంచి పవన్ సినిమా రీ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారాన్ని ఆధారంగా చేసుకునే ఇది తెలిపినప్పటికీ జనసేన కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉన్న పవన్ ఎంత వరకు ఇది చేస్తాడనే అనుమానాలు కూడా లేకపోలేదు. వాటిని కూడా అందులో ఉటంకిస్తూనే కథనాలు వచ్చాయి. ఇది కాస్త అభిమానుల మధ్య విపరీతమైన ఆసక్తికి చర్చకు తెరలేపడంతో పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన ఇచ్చేసాడు. పూర్తిగా ప్రజా జీవితం కోసం అంకితమైపోయిన జనసేన కోసం తాను చేయాల్సింది చాలా ఉందని సినిమాల గురించి ఆలోచించే తీరిక లేదని దేనికీ అంగీకరించలేదని క్లారిటీ ఇచ్చేసాడు. పాలకుల తప్పిదాలను ఎండగడుతూ ప్రజలతో అభిమానులతో ముందుకు నడవాల్సిన తరుణంలో సినిమాలు చేయనని తన తపన మొత్తం సమసమాజ స్థాపన కోసమే అని సంతకంతో కూడిన నోట్ ని విడుదల చేసింది జనసేన కార్యాలయం.ఫైనల్ గా పవన్ సినిమా రీ ఎంట్రీ గురించిన సమాచారానికి తాత్కాలిక బ్రేక్ పడింది. నిర్మాత పేరు సినిమాలో ఎంత నిడివి ఉంటుంది అనే వివరాలతో న్యూస్ బయటికి రావడంతో ఫ్యాన్స్ దీని గురించి రకరకాల అంచనాల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడీ లేఖ ద్వారా స్పష్టత వచ్చేసింది. ఒకవేళ నిజంగా సినిమా చేయాలి అనుకున్నా ఎన్నికలకు కేవలం ఆరు నెలలు మాత్రమే సమయం ఉండటంతో షూటింగ్ చేయడం సాధ్యపడదు. ఈ నేపథ్యంలో పవన్ అన్ని రకాలుగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. వచ్చే ఏడాది ఎన్నికల హడావిడి పూర్తయ్యాక మళ్ళి సినిమాల ప్రస్తావన పవన్ నుంచి వస్తుందేమో చూడాలి.