Begin typing your search above and press return to search.

పవన్ ని చూపిస్తే కానీ నమ్మరు బాసూ..

By:  Tupaki Desk   |   31 July 2015 5:36 PM GMT
పవన్ ని చూపిస్తే కానీ నమ్మరు బాసూ..
X
ఎప్పుడో రెండేళ్ల కిందటే ‘గబ్బర్ సింగ్-2’కు సంబంధించి ముహూర్త కార్యక్రమం జరిగింది. అప్పట్నుంచి సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. పవన్ ఈసారి ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్నారు దర్శకులు. కానీ వాళ్ల ఎదురు చూపులు ఇంకా ఫలించలేదు. ఈ రెండేళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. డైరెక్టరూ మారాడు. రచయితలు మారారు. ఇంకా చాలా చాలా మారాయి. రెండు నెలల ముందు ఎక్కడో పుణెలో షూటింగ్ మొదలైందంటూ డైరెక్టర్ బాబి మెగా ఫోన్ చేతబట్టిన పిక్చర్ విడుదల చేశాడు నిర్మాత శరత్ మరార్. హమ్మయ్య సినిమా మొదలైందిలే అనుకుంటే మళ్లీ సస్పెన్స్. షూటింగ్ కు బ్రేక్. పైగా అప్పటిదాకా జరిగిన షూటింగులో పవన్ పాల్గొనకపోవడంతో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.

ఐతే నిన్ననే హైదరాబాదులో సర్దార్ రెగ్యులర్ షూటింగ్ మొదలైందని చెబుతున్నారు. ఈ సందర్భంగా సర్దార్ ‘సైడ్ లుక్’ ఒకటి ట్విట్టర్లో పెట్టాడు శరత్ మరార్. అయినా ఫస్ట్ లుక్ అంటూ హీరో ముఖం చూపించడం చూశాం కానీ.. ఈ సైడ్ లుక్ ఏంటో అర్థం కావడం లేదు. ఇదంతా కాదు.. పవన్ బొమ్మ చూపించండి.. అప్పటికి కానీ సినిమా మీద నమ్మకం కుదరదంటున్నారు అభిమానులు. ఆ మధ్య సినిమా కసం పవన్ గడ్డం తీసేశాడని చాలా ప్రచారం జరిగింది. కానీ మళ్లీ గురుడు గడ్డంతోనే దర్శనమిచ్చాడు. ఇప్పుడు కూడా గడ్డం గీయబడినట్లే చెబుతున్నారు. కానీ కన్ఫర్మేషన్ లేదు. గడ్డం లేని పవన్ ను కొత్తగా ఖాకీ దుస్తుల్లో చూస్తే తప్ప అభిమానులకు నిద్ర పట్టేలా లేదు. ఈ సైడ్ లుక్స్ అవీ కాకుండా నేరుగా పవన్ స్ట్రెయిట్ లుక్ ఒకటి రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తే బెటర్.