ఖైదీకి అతి పెద్ద ఫ్లెక్సీ కడుతున్న పవన్ ఫ్యాన్స్

Tue Jan 10 2017 15:43:19 GMT+0530 (IST)

చిరంజీవి.. పవన్ కళ్యాణ్ ల మధ్య.. వారి అభిమానుల మధ్య విబేధాలు అంటూ రకరకాల కథనాలు ప్రచారం అయిపోతుంటాయ్ కానీ.. సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి.. అందరూ ఒకటే అనే విషయం బైట పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఖైదీ నంబర్ 150 విషయంలో పవన్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా చూస్తే.. మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే.

ఖైదీ నంబర్ 150కి విశాఖలో అతి పెద్ద ఫ్లెక్సీని కట్టేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. 104 అడుగుల వెడల్పు.. 38 అడుగులు ఎత్తుతో.. బహుశా అతి పెద్ద ఫ్లెక్సీని డిజైన్ చేయించారు. వైజాగ్ లో విమాక్స్ లో ఈ ఫ్లెక్సీ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం ఓ భారీ క్రేన్ రెంట్ కి తీసుకొచ్చి మరీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మొత్తం విమాక్స్ థియేటర్ వాల్ అంతా కవర్ అయిపోయే రేంజ్ లో ఫ్లెక్సీని డిజైన్ చేయించారంటే.. మెగా క్రేజ్ ఈ ఏరేంజ్ పీక్స్ లో ఉందో అర్ధమవుతుంది.

ఒక్క వైజాగ్ లోనే కాదు.. రాష్ట్రమంతా ఇప్పుడు ఇదే సందడి. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటికే వీర రేంజ్ లో ఖైదీ కోసం ఏర్పాట్లు చేసేస్తున్నారు. రేపు ఒక్క రోజు రాష్ట్రంలోని దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలోనూ మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రదర్శితం కానుందనే విషయం తేలిపోయింది. తొలి రోజు రికార్డుల విషయంలో.. ఇండస్ట్రీ హిట్ పై కన్నేసిన మెగాఫ్యాన్స్.. అందివచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేరు. మరి మెగాస్టార్ ఏ రేంజ్ రికార్డులు సృష్టించనున్నారో తెలియాలంటే.. మరికొన్ని గంటలు ఆగాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/