Begin typing your search above and press return to search.

పవన్ కొత్త డిస్ప్లే పిక్చర్ పెట్టాడే!!

By:  Tupaki Desk   |   20 Jan 2017 10:38 AM GMT
పవన్ కొత్త డిస్ప్లే పిక్చర్ పెట్టాడే!!
X
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్.. అదే రాజకీయాల్లోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అంటే జనసేన అధినేత. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేవరకూ జనాల్లో కలిసేందుకు అంతగా ఇష్టపడని పవన్ ఇప్పుడు మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నాడు. అయితే.. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నాడు.

జనసేన అధినేతగానే ట్విట్టర్ హ్యాండిల్ ని రన్ చేస్తున్న పవన్.. ఈరోజు మాత్రం చాలా మంచి మూడ్ లో చాలా విషయాలు పోస్ట్ చేశాడు. అలాగే పంజా సినిమాలోని స్టిల్ ఒకటి.. తన ఫామ్ హౌస్ లో గతంలో తీసిన పిక్చర్ ఒకటి షేర్ చేశాడు. ఆ తరువాత కొత్త డిస్ప్లే పిక్చర్ మార్చేశాడు పవర్ స్టార్. ఇన్నాళ్లు తను గ్లామరస్ గా ఉండే ఫోటోలను పెట్టేవాడు జనసేన అధినేత. గతంలో కూడా ఓసారి మార్చినా అది కూడా పవన్ అందంగా కనిపించేదే. ఒక సినిమాలో స్టిల్ నే పెట్టాడు. కానీ ఈసారి మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉన్న ఫోటోను డీపీగా పెట్టాడు పవన్.

ఏ మాత్రం మేకప్ లేకుండా.. మధ్య పాపిడి తీసిన తల.. సగం నెరిసిపోయి గుబురుగా పెంచిన గడ్డం అండ్ మీసం. ఇదీ తాజా డీపీలో పవన్ రూపం. ఇలా హఠాత్తుగా ఓ ఋషి టైపులో పిక్చర్ ను డిస్ ప్లే పిక్చర్ గా పెట్టాలని పవన్ కు ఎందుకు అనిపించిందో కాని.. చాలా గమ్మత్తుగా కనిపిస్తున్నాడు. అయితే ఇది పాత ఫోటో అని వేరే చెప్పక్కర్లేదుగా. ప్రస్తుతం పవన్ కాటమరాయుడు గెటప్ లో అక్కడ షూటింగ్ ఇరగదీస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/