ఎన్టీఆర్ కోసం పవన్ త్యాగం?

Mon Oct 23 2017 11:31:39 GMT+0530 (IST)

ఒక సినిమా తీయడానికి కాంబినేషన్ అంతా సెట్ అయినప్పుడు తారలు ఎంత బిజీగా ఉన్నా కూడా చిత్ర నిర్మాతలు షూటింగ్ మొదలుపెడితే ఒక పనైపోతుందనుకొని ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతారు. హీరోలు కూడా షెడ్యుల్స్ ని సైతం చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా ఒక హీరో కోసం మరో హీరో తన షెడ్యూల్ ని త్యాగం చేశాడు.



ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నడో తెలిసిన విషయమే. తన 25వ సినిమా చేస్తూనే రాజకీయాల వైపు కూడా అడుగులు వేస్తున్నారు. తన బిజీ షెడ్యూల్ వల్ల పవన్ తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడం లేదు. సినిమాను త్వరగా పూర్తి చేసి రెగ్యులర్ గా రాజకీయాల్లో పాల్గొనడానికి ఏ మాత్రం తీరిక లేకుండా పని చేస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా చివరి షెడ్యూల్ యూరోప్ లో జరగనుంది. అయితే ఎన్టీఆర్ కోసం పవన్ తన షెడ్యూల్ ని వాయిదా వేసుకున్నాడు.

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా రామానాయుడు స్టూడియోలో నేడు ప్రారంభం అయ్యింది. నిర్మాతలు సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడంతో దర్శకుడు త్రివిక్రమ్ ఉండాలి కాబట్టి పవన్ రెండు రోజులు తర్వాత యూరోప్ కి పయనమవ్వనున్నాడట. అంతే కాకుండా ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ కూడా విచ్చేసి.. టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపాడు.