Begin typing your search above and press return to search.

ఆచి తూచి ఆడియో ఫంక్షన్

By:  Tupaki Desk   |   12 Dec 2017 4:22 AM GMT
ఆచి తూచి ఆడియో ఫంక్షన్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్న అజ్ఞాతవాసి రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని బయటకొచ్చి చూస్తే టైమేమో పాటను అభిమానుల కోసం రిలీజ్ చేశారు. అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్ గా ఉండటంతో అభిమానుల్లో ఈసినిమాపై బజ్ మరింత పెంచింది. త్వరలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసే ఏర్పాట్లలో సినిమా యూనిట్ ఉంది. ఈ ఫంక్షన్ హైదరాబాద్ లోనే జరగనుంది. భారీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించాలని ఆలోచిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే వేడి మొదలైంది. జనసేన పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ రీసెంట్ గా పొలిటికల్ వ్యవహారాల్లోనూ బాగా యాక్టివ్ అయ్యాడు. ఇలాంటి తరుణంలో అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ ద్వారా పవన్ పొలిటికల్ కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది రాకుండా.. అదేటైంలో సినిమాపై ఎటువంటి విమర్శలు రాకుండా ఉండేలా ఈ ఫంక్షన్ పూర్తి చేయడం ఓ రకంగా నిర్వాహకులకు కత్తిమీద సాములాంటిదేనని చెప్పాలి. అభిమానులతో పాటు వ్యతిరేకులు వచ్చి గలాభా చేసే అవకాశాలు ఉన్నందున ఆ కోణంలోనూ ఆలోచించి ఏం చేయాలన్నదానిపై చర్చిస్తున్నారు. అందుకే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బయో మెట్రిక్ పాసులిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.

అజ్ఞాతవాసి ఆడియోనే కాదు.. ఆడియో రిలీజ్ ఫంక్షన్ టెలికాస్ట్ రైట్స్ కూడా భారీ మొత్తం పలికాయి. ఈ ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ రైట్స్ కోసం టి.వి.5 రూ. 85 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆడియో ఎప్పుడు.. ఎక్కడ నిర్వహించాలనే దానిపై అజ్ఞాతవాసి యూనిట్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.