Begin typing your search above and press return to search.

'అజ్ఞాతవాసి'.. ఒక టైటిల్ కథ!!

By:  Tupaki Desk   |   16 Oct 2017 11:24 AM GMT
అజ్ఞాతవాసి.. ఒక టైటిల్ కథ!!
X
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న తన 25వ చిత్రం గురించి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎదురుచూస్తుందనే చెప్పాలి. ఇక తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా గురించి ఏ న్యూస్ వచ్చినా వదలడం లేదు. పవన్ కళ్యాణ్ నేమ్ వినబడితే చాలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మాట్లాడుకుంటున్నారు. అందులోను త్రివిక్రమ్ సినిమాను తెరకెక్కిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలను రేపుతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు చాలా మీడియాల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. సోషల్ మీడియాలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ టైటిల్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కానీ చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. త్రివిక్రమ్ తన సినిమాల టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటాడు. స్టార్ హీరో ఎవరైనా సరే ఆయన ఇమేజ్ కి అపోజిట్ గా టైటిల్ సెట్ చేసి సినిమాకి హైప్ తెస్తారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కి మొదట జల్సా అని కథకు తగ్గట్టుగా పెట్టి. ఆ తర్వాత కూడా కథకు తగ్గట్టు అత్తారింటికి దారేది అని సింపుల్ గా టైటిల్ పెట్టి అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు అదే తరహాలో అజ్ఞాతవాసి అనే టైటిల్ ను కూడా ఆలోచించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చిత్ర నిర్మాతలు టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించారట. అయితే ముందుగా వౌర్కౌట్ అవుతుందా ? కాదా ? అని త్రివిక్రమ్ ఈ టైటిల్ ను జస్ట్ ఆప్షన్ గా అనుకున్నారట. కానీ ప్రస్తుతం పరిస్థితిని చూస్తే అజ్ఞాతవాసి టైటిల్ అందరికి నచ్చేసింది. ఒకవేళ ఎవ్వరికి నచ్చకపోతే వేరే టైటిల్ ను పెడదామని అందుకే ఎటువంటి కామెంట్స్ దాని పై చెయ్యకూడదు అనుకున్నారట. అంతే కాకుండా త్రివిక్రమ్ ఇంకో మూడు టైటిల్ లను అడ్వాన్స్ గా పెట్టేసుకొని రెడీ గా ఉన్నారట. ఒకటి సక్సెస్ అవ్వకుంటే మరొకటి అని ఫ్యాన్స్ కే టైటిల్ డిసిషన్ ఇలా ఇన్ డైరెక్ట్ గా వదిలేశారు. ఏదైతే ఏంటి టైటిల్ ఎలా ఉన్నా పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.