Begin typing your search above and press return to search.

సప్తగిరికి బంపర్ ఆఫర్ తగిలినట్టేనా?

By:  Tupaki Desk   |   27 Oct 2016 5:07 AM GMT
సప్తగిరికి బంపర్ ఆఫర్ తగిలినట్టేనా?
X
కమెడియన్ గా నిలదొక్కుకున్న తరువాత హీరో ప్రయత్నాలు చేసి తమ లక్ ని పరీక్షించుకోవడం మన నవ్వుల చంద్రులకి అలవాటే. ఆనాటి రేలంగి నుండి ఈనాటి శ్రీనివాస్ రెడ్డి వరకూ ఈ పంధాలో ప్రయత్నించినవారే. ఈ క్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కమెడియన్ సప్తగిరి సైతం సిద్ధపడుతున్న సంగతి తెలిసినదే.

దర్శకుడు అరుణ్ పవార్ తెరకెక్కించిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో దీన్ని పుకారుగా కొట్టిపారేసినా ఈ వార్త నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు.

వివరాలకి వెళ్తే పవన్ ప్రస్తుత సినిమా కాటమరాయుడు టైటిల్ ని సప్తగిరి అండ్ టీమ్ తమ చిత్రం కోసం చేయించుకున్నాడట. అయితే పవన్ టీమ్ అడగడంతో త్యాగం చేసి ఇప్పుడు సప్తగిరి ఎక్స్ ప్రెస్ అనే టైటిల్ ని పెట్టినట్టు సమాచారం. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేగాక అరుణ్ పవర్ కి ఇండస్ట్రీ బిగ్ హెడ్స్ తో పరిచయం వుండడం కూడా ఈ వార్తకి కారణమవ్వచ్చని అంచనా. ఏదైనాసరే ఇదే గనుక జరిగితే సప్తగిరి బంపర్ ఆఫర్ కొట్టినట్టే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/