Begin typing your search above and press return to search.

తమిళ డైరక్టరను తెరమీదకు తెచ్చిన పవన్‌

By:  Tupaki Desk   |   23 July 2016 11:02 AM GMT
తమిళ డైరక్టరను తెరమీదకు తెచ్చిన పవన్‌
X
తన కెరియర్ మొదటి నుండీ తమిళ డైరక్టర్లతో బాగానే సింకులో ఉన్నాడు పవన్ కళ్యాణ్. మనోడు ఇదివరకు కరుణాకరన్‌ - ఎస్.జె.సూర్య - ధరణి - విష్ణువర్దన్‌ తదితర తమిళ డైరక్టర్లతో పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యన వరుసగా తెలుగు డైరక్టర్లతో పనిచేస్తున్న పవర్‌ స్టార్‌.. ఇప్పుడు మరోసారి ఒక తమిళ డైరక్టర్ కు ఛాన్సిచ్చినట్లు తెలుస్తోంది.

నిజానికి ఎస్.జె.సూర్య డైరక్షన్‌ లో పవన్ చేస్తోంది ''వేదాలం'' సినిమా రీమేక్ అనే మొదటి నుండి ఉన్న రూమర్. అయితే తరువాత ఈ దర్శకుడి ప్లేసులో డాలి వచ్చిన సంగతి తెలిసిందే. కాని కథ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు. అయితే పవన్‌ చేస్తున్న కథ వేరే కావడంతో.. వేదాలం రీమేక్ ను తాను రూపొందిస్తానంటూ ముందకొచ్చాడట ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం. మరి దర్శకుడిగా ఎవర్ని పెడదాం అని అంటే.. ''జిల్లా'' సినిమాతో పాపులర్ అయిన నీసన్ అనే దర్శకుడిని తీసుకుందాం అంటూ స్వయంగా పవన్‌ సూచించాడు అంటూ రూమర్లు వస్తున్నాయి.

ఆ లెక్కన చూస్తే.. ఇప్పుడు డాలితో చేసే సినిమా పూర్తవ్వగానే అటు నీసన్ అటు త్రివిక్రమ్ తో కలసి ఏదో ఒక సినిమాను ముందు పట్టాలెక్కిస్తారనమాట. చూద్దాం ఏం జరుగుతుందో!!