Begin typing your search above and press return to search.

నిఖిల్ తో పవన్ అన్న మాటేమంటే..?

By:  Tupaki Desk   |   1 Dec 2015 10:30 PM GMT
నిఖిల్ తో పవన్ అన్న మాటేమంటే..?
X
చిన్న సినిమాగా మొదలైనా.. నిర్మాతగా మారిన కోన వెంకట్ పుణ్యమా అని ఆ సినిమా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమై విషయం బయటకు రాకుండా ఉండిపోయింది. శంకరాభరణం టీజర్ ను అప్పట్లో వపర్ స్టార్ పవన్ కల్యాణ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా టీజర్ ను చూస్తే.. పవర్ స్టార్ ఏదో అనటం.. దానికి నిఖిల్ తెగ సిగ్గుపడిపోవటం కనిపించింది. నిఖిల్ తో పవర్ స్టార్ ఏమన్నాడన్న డౌట్ అప్పటి నుంచి ఉండిపోయింది. దీని గురించి.. ఎవరూ చెప్పింది లేదు. తాజాగా.. ఈ విషయాన్ని నిఖిల్ చెప్పుకొచ్చారు. శంకరాభరణం ప్రమోషన్ కోసం బిజీగా ఉన్న అతగాడు.. తాజా చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ చెప్పని ఒక విషయం చెప్పాలన్న మాటకు.. పవన్ కల్యాణ్ తనతో అన్న మాటను బయటపెట్టేశాడు.

టీజర్ విడుదల చేసిన తర్వాత.. తనను చూసిన వెంటనే పవన్ రియాక్ట్ అవుతూ.. ‘‘బాడీ పెంచావా?’’ అని అడిగారని.. అన్నాళ్లు జిమ్ లో పడిన కష్టం తన అభిమాన స్టార్ గుర్తించటంతో ఎగిరిపోయిందని ఆనందపడిపోతూ చెప్పుకొచ్చాడు. తానెంతో అబిమానించే పవన్ కల్యాణ్ తనలోని మార్పును ఇట్టే గుర్తించటం చాలా హ్యాపీగా ఉందంటున్నాడీ కుర్రహీరో.