Begin typing your search above and press return to search.

కడప కింగ్ కాదు.. కాటమ రాయుడు

By:  Tupaki Desk   |   30 Aug 2016 4:22 AM GMT
కడప కింగ్ కాదు.. కాటమ రాయుడు
X
అటు సినిమాలను ఇటు రాజకీయాలను రెండింటినీ హ్యాండిల్ చేయబోతున్నట్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే చెప్పాడు. ఒకవైపు పొలిటికల్ వ్యవహారాలను చూసుకుంటూనే.. మరోవైపు సినిమాలను కూడా చేస్తానని సెలవిచ్చాడు పవన్. అందుకు తగ్గట్లుగానే రీసెంట్ గా రాజకీయ బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ గా మారిపోయేందుకు ముహూర్తం మరో వారం రోజులే ఉందని తెలుస్తోంది.

కేవలం 50 రోజుల్లోనే ఈ మూవీకి సంబంధించి తన పార్ట్ ను షూటింగ్ చేసేయాలని పవన్ చూస్తున్నాడు. వరుసగా కాకపోయినా.. ఒకట్రెండు బ్రేక్స్ తో.. ముందు పవన్ కి సంబంధించిన సీస్స్ అన్నీ తెరకెక్కించేయనున్నారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ విషయంలో ఇప్పుడో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ కడప కింగ్ అనే టైటిల్ ప్రచారం జరిగినా.. 'కాటమ రాయుడా' అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసే ఛాన్సులున్నాయని తెలుస్తోంది. అత్తారింటికి దారేది మూవీలో 'కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా' అని పవన్ కళ్యాణ్ పాట పాడిన తర్వాత.. జనాలకు ఈ పదం బాగా నోటెడ్ అయిపోయింది.

డాలీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న కొత్త చిత్రం షూటింగ్లో.. సెప్టెంబర్ మొదటివారం నుంచి జాయిన్ కానున్నాడు పవన్. ఇప్పటికే స్టోరీ సంగతులు తన టీమ్ కి అప్పచెప్పేయగా.. ఇక స్క్రిప్ట్ జోలికి తాను వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడట. అలాగే.. పవన్ మూవీని వచ్చే ఏడాది మార్చ్ 25న రిలీజ్ చేయాలని నిర్మాత శరత్ మరార్ భావిస్తున్నాడని తెలుస్తోంది.