జాలీ ఎల్‌ఎల్‌బి గా పవర్ స్టార్

Sun May 14 2017 10:48:16 GMT+0530 (IST)

హిందీలో అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్‌ఎల్‌బి 2  ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయం కైవసం చేసుకుంది. కొంచెం డ్రామా కొంచం కామెడీ కొంచం ప్రేమ మరికాస్త సందేశం ఉన్న ఈ సినిమాని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను విక్టరి వెంకటేష్ చేస్తాడు అని అనుకొన్నారు అందరూ. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందట. 

హారిక హాసిని నిర్మాణ సంస్థ ఈ చిత్ర కాపీ రైట్స్ ని 1.75 కోట్లు పెట్టి కొన్నదట. ఇదే బేనర్ పై ఇప్పుడు పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమాకు నిర్మాతగా ఉన్నారు. పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ ఈ సినిమాను చూశారుని వాళ్ళకి బాగా నచ్చి చేయడానికి ఓకే అన్నారని.. అందుకే ఈ సినిమాను కొన్నారని తెలుస్తోంది. అంతేకాని వెంకీ కోసం కాదట. ఈ రీమేక్ ను సెప్టెంబర్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. అప్పటికి ఇప్పుడు నడుస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే జాలీ ఎల్‌ఎల్‌బి 2 ను త్రివిక్రమ్ డైరక్షన్ చేయడం లేదు కానీ మాటలు అందిస్తారు.  ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ఒకటి ఉంది అది అక్టోబర్ నుండి మొదలువుతుంది. అందుకోసం ఈ సినిమాకు వేరే డైరెక్టర్ కోసం వెతుకుతున్నారు. 

పవన్ కు ఇప్పుడు రీమేక్ సినిమాలు బాగానే వర్క్ ఔట్ అవుతునాయి. మొన్న గబ్బార్ సింగ్ బాక్స్ ఆఫీసు దగ్గర చేసిన ప్రభంజనం ఇప్పటికీ రీసౌండ్ వస్తుంది కదా. కాటమరాయుడు అంతగా బాక్స్ ఆఫీసు దగ్గర ఆడకపోయాన పవన్ సత్తా అలానే పదిలంగా ఉంది. అంతకుముందు గోపాల గోపాల సినిమాలో ఆయన గెస్ట్ రోల్ పవర్ ఏంటో తెలిసిందే. అందుకు ఇప్పుడు మంచి సక్సెస్ పైగా కథ బలం ఉన్న జాలి ఎల్ ఎల్ బి ఎంచుకున్నాడేమో.

TAGS: