Begin typing your search above and press return to search.

వావ్.. పవన్ వైఫ్‌ పార్టీకి వచ్చిందా??

By:  Tupaki Desk   |   23 Aug 2016 11:46 AM GMT
వావ్.. పవన్ వైఫ్‌ పార్టీకి వచ్చిందా??
X
ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ వైఫ్‌ గురించి మరోసారి సోషల్ నెట్వర్కులో చర్చలు మొదలయ్యాయ్. నిజానికి రేణు దేశాయ్ కు డైవర్స్ ఇచ్చేసి అన్నా లెజినోవా అనే రష్యన్ సంతతికి చెంది ఆస్ర్టేలియా అమ్మాయిని పెళ్ళిచేసుకున్నట్లు అసలు ఎవ్వరికీ తెలియదు. జనసేన స్థాపించిన కొత్తలో మ్యారేజ్ రిజిష్ట్రేషన్ డాక్యుమెంట్ బయటకు రావడంతో ఈ విషయం పొక్కింది. కట్ చేస్తే అసలు ఆమె ఎలా ఉంటుంది?

ఆ విషయం తెలియదు కాని మొన్నామధ్యన శ్రీజ పెళ్ళికి ఒక ఫారినర్ అమ్మాయి వచ్చింది. ఆమే అన్నా లెజినోవా అంటూ ఊరంతా టామ్ టామ్ అయ్యింది. అయితే చిరంజీవి బెంగుళూరు ఫామ్ హౌస్ లో జరిగిన ఆ పెళ్ళికి కేవలం ఆప్తమిత్రులు - బంధువులను మాత్రమే పిలిచారు కాబట్టి.. ఖచ్చితంగా ఆ వచ్చిన ఫారిన్ లేడీ పవన్‌ వైఫ్‌ అయ్యుంటుందని అందరూ అంచనా వేశారు. ఇప్పుడు అదే అమ్మాయి మరోసారి గత రాత్రి జరిగిన మెగాస్టార్ 61వ బర్త్ డే సెలబ్రేషన్స్ కు విచ్చేసింది. అందుకే ఇప్పుడు అన్నా లెజినోవా ఈజ్ బ్యాక్.. పవన్ రాకపోయినా కూడా ఆయన భార్య విచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

ఇకపోతే కనీసం ఒక్కసారైన పవన్ కళ్యాణ్‌ ఆమెతో కలసి ఎక్కడన్నా కనిపిస్తే.. ఈవిడే ఆ సో కాల్డ్ అన్నా లెజినోవా అని అందరూ అనుకోవడానికి ఉంటుంది. లేకపోతే మనం చూసేది ఆమెనేనా కాదా అనే సందేహాలు వస్తూనే ఉంటాయి.