Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం పవన్ వస్తున్నాడా?

By:  Tupaki Desk   |   22 Oct 2017 7:30 AM GMT
ఎన్టీఆర్ కోసం పవన్ వస్తున్నాడా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించిన వేడుకలకు రావడమే కష్టమైపోతోంది. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరైతే ఎలా ఉంటుంది? ఈ అరుదైన దృశ్యం చూసే అవకాశం సోమవారం రాబోతోందట. పవన్ మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సోమవారమే రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ఆరంభం కాబోతోంది.

ఈ వేడుకకు పవన్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారట. మరి పవన్, ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్‌లో ఎలా ఉంటారా అన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కొన్ని రోజుల కిందటే ఎన్టీఆర్.. రామ్ చరణ్ కలిసి దిగిన ఫొటో ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. మరి పవన్-ఎన్టీఆర్ కలిస్తే ఎలా ఉంటుందో చూద్దాం.

ఎన్టీఆర్ తో తొలిసారి త్రివిక్రమ్ సినిమా చేస్తుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న అతడి మిత్రుడు ఎస్.రాధాకృష్ణనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పవన్-త్రివిక్రమ్ సినిమాకు సంగీతాన్నందిస్తున్న అనిరుధ్ రవిచందరే ఈ చిత్రానికీ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ప్రారంభోత్సవం చేసి.. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు త్రివిక్రమ్.. ఎన్టీఆర్.