త్రివిక్రమ్ కి పవన్ కండిషన్ పెట్టాడా?

Fri Oct 20 2017 09:40:22 GMT+0530 (IST)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం కోసం ప్రస్తుతం  తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆయన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సోషల్ మీడియాలో ఎక్కడ ఆజ్ఞతవాసి అని కనిపించినా న్యూస్ ని తెగ చదివేస్తున్నారు. త్రివిక్రమ్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ ప్రస్తుతం పాలిటిక్స్ వైపు ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు.జనసేనను నడిపిస్తూనే మరో వైపు సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే అప్పుడపుడు సినిమాకి తన వల్ల బ్రేకులు పడటం పవన్ కి నచ్చడం లేదు. దీంతో ఫైనల్ గా త్రివిక్రమ్ కి ఒక టార్గెట్ పెట్టాడట పవన్ కళ్యాణ్. ఎలాగైన నవంబర్ 25 లోపు షూటింగ్ మొత్తం పూర్తవ్వాలని దర్శకుడిపై భారం వేశాడట. సినిమా చివరి షెడ్యూల్ యూరోప్ లో జరగనుంది. చిత్ర యూనిట్ ఈ నెల 21 నుంచి నవంబర్ 15 వరకు అక్కడే ఫైనల్ షెడ్యూల్ ని పూర్తి చేయడానికి రెడీ అవుతోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం 25 వరకు అయిపోవాలని పవన్ త్రివిక్రమ్ ని కొరాడట.

దీంతో త్రివిక్రమ్ మళ్లీ కొత్త తరహా ప్లాన్స్ వేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కి సంబందించిన పనులని ఆ డేట్ లో పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆడియో ను డిసెంబర్ లో రిలీజ్ చేసి ముందుగా అనుకున్న ప్రకారమే సినిమాను నెక్స్ట్ ఇయర్ జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.