పక్కా ప్లాన్ తో పవన్ ఇన్వెస్ట్మెంట్?

Mon Oct 23 2017 14:18:01 GMT+0530 (IST)

రాజకీయాల్లోకి వెళ్లాలంటే ఈ రోజుల్లో సాధారణమైన విషయం కాదు. యువకులుగా ఉన్నప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే సగం వయసొచ్చాక గాని అధికారం దక్కడం లేదు. ఇక స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు వస్తున్నా అందరూ సక్సెస్ అవ్వడం లేదు. రాజకీయాల్లో ఉండాలంటే ఎంత కొంత డబ్బు ఉండాలి. పార్టీ మీటింగ్ లు జరగాలన్నా లేక ఇతర కార్యక్రమాలను నిర్వహించాలన్నా కూడా డబ్బు చాలా అవసరం. సినీ తారలు కొంతమంది రాజకీయాల్లో ఎంట్రీ కొంత వరకు చేతులు కాల్చుకున్నారు.ముఖ్యంగా బాలీవుడ్ లో అమితాబ్ అలాగే కోలీవుడ్ హీరో విజయ్ కాంత్ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి  కొంత వరకు నష్టపోయారు. అయితే ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ పరిస్థితిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన స్థాపించినప్పటి నుండి పార్టీకి చాలా మద్దతు లభిస్తోంది. అసలే పవన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. మొన్నటి వరకు జరిగినది ఒక ఎత్తైతే ఇప్పుడు జరగబోయేది మరొక ఎత్తు. జనసేనని నడిపించాలంటే ఖర్చు తప్పదు. అయితే పవన్ మాత్రం ముందే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడట.

సీక్రెట్ గా ఆయన హారికా - హాసిని ప్రొడక్షన్ లో పాట్నర్ గా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కి అండగా త్రివిక్రమ్ ఉంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ సినిమాల్లో ఇన్వెస్ట్ చేస్తూ అడ్జస్ట్ చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక తనకు వచ్చిన రెమ్యునరేషన్ తోనే పార్టీని ఆ విధంగా ముందుకు తీసుకువెళుతున్నారని మరికొంతమంది వాదన. ఎలా అయితే ఏంటీ? పవన్ చాలా జాగ్రత్తతో పని చేసుకుంటున్నాడని చెప్పవచ్చు.