Begin typing your search above and press return to search.

అప్పుడు బండ్ల.. ఇప్పుడు నితిన్

By:  Tupaki Desk   |   3 May 2016 6:39 AM GMT
అప్పుడు బండ్ల.. ఇప్పుడు నితిన్
X
స్వయంగా కొంత స్టార్ ఇమేజ్ ఉన్న హీరోనే అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ ముందుకొస్తే నితిన్ నిలవలేడసలు. తన ప్రతి సినిమాలోనూ పవన్ మీద అభిమానాన్ని చాటుకునే నితిన్.. ఇక నేరుగా పవన్ కనిపిస్తే ఎలా ఊరుకుంటాడు? ‘అ..ఆ’ ఆడియో వేడుకలో అలాగే రెచ్చిపోయాడు. పవన్‌ను పొగడ్డంలో బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా అనుకున్నారు. ఐతే నితిన్.. బండ్లకు గట్టి పోటీనే ఇచ్చాడు. అందుకు నిదర్శనం.. నితిన్ మాట్లాడుతుండగా పవన్ నవ్విన నవ్వు.

అప్పట్లో ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక సందర్భంగా బండ్ల వేదిక మీద తనను హద్దూపద్దూ లేకుండా పొగిడేస్తుంటే కింద పవన్ నవ్వి నవ్వి అలసిపోయాడు. ఆ పొగడ్తలకు తట్టుకోలేక చాలా సిగ్గుపడిపోతూ చేతుల్లో ముఖం దాచుకుంటూ పవన్ నవ్విన నవ్వును ఎవ్వరూ మరిచిపోలేరు. మామూలుగా ఎవరైనా తనను పొగుడుతుంటూ పవన్ చాలా కామ్‌ గా కనిపిస్తాడు కానీ.. ఆ రోజు బండ్ల మరీ దారుణంగా పొగడ్డంతో పవన్ నవ్వు ఆపుకోలేకపోయాడు. మళ్లీ నితిన్ ప్రసంగానికి సేమ్ టు సేమ్ అలాగే రెస్పాండయ్యాడు పవన్.

‘జయం’ ఆడిషన్స్ సందర్భంగా తాను వేసిన చూపించిన ‘తమ్ముడు’ స్టెప్పును చూపిస్తూ నితిన్ డ్యాన్స్ చేసినపుడు.. ఆ తర్వాత పవన్ అంటే తనకెంత ఇష్టమో చెప్పినపుడు.. ఐలవ్యూ పవన్ సార్ అన్నపుడు.. తర్వాత ‘ఒక్కడు’ సినిమాలో తాను ప్రకాష్ రాజ్ అయితే త్రివిక్రమ్ భూమిక అని పోలిక పెడుతూ ఆయనకు కూడా ఐలవ్యూ చెప్పినపుడు.. పవన్ గట్టిగా నవ్వాడు. ఓ దశలో నవ్వు ఆపుకోలేక ముఖానికి చెయ్యి అడ్డుపెట్టిన తీరు చూసి అందరికీ ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక నాటి దృశ్యాలే గుర్తుకొచ్చాయి.