Begin typing your search above and press return to search.

పవన్ ఫిజిక్ మారిందా? పట్టు తప్పిందా?

By:  Tupaki Desk   |   21 Oct 2017 11:30 PM GMT
పవన్ ఫిజిక్ మారిందా? పట్టు తప్పిందా?
X
మెగాస్టార్ తమ్ముడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ రోజుల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తన 20 ఏళ్ల కెరీర్ లో విజయం అందుకున్న చిత్రాలు కొన్నే. కాని ఆ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచాయి. ఆయనతో పాటు వచ్చిన హీరోలు చాలా వరకు అభిమానులను సంపాదించుకోవడంలో అంతగా ప్రభావం చూపకపోయినా పవన్ మాత్రం తన వ్యక్తిగతంతోనే ఎక్కువా మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

అయితే ఇప్పుడు పవన్ గురించి కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల తన 25వ చిత్రంలోని ఒక ఫొటోను దర్శకుడు త్రివిక్రమ్ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. ఆ ఫొటోలో పవన్ చాలా ఛబ్బీగా కనిపిస్తున్నాడు. సాధారణంగా పవన్ ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల తన ఫిట్ నెస్ గురించి అస్సలు పట్టించుకోలేదు అనుకోవాల్సిందే ఆ ఫోటోలను చూస్తే. ఇక త్రివిక్రమ్ దర్శకత్వం లో కొత్త ఫిజిక్ తో పవన్ కనిపిస్తున్నాడా లేక బాడీ గురించి పట్టించుకోక అలా అయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా చివరి షెడ్యూల్ ఒకటి అయిపోతే సినిమా షూటింగ్ మొత్తం ఎండ్ అయినట్టే. మరి పవన్ ఈ లుక్ లో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి. ఇకపోతే బెంగుళూరులో పవన్ ఇంట్రోకి సంబంధించిన సీన్లను మొన్ననే ఫినిష్‌ చేసిందీ చిత్ర యునిట్.