Begin typing your search above and press return to search.

జివ్వుమన్న పవన్ వద్దని చెప్పలేదే!!

By:  Tupaki Desk   |   25 March 2017 11:31 AM GMT
జివ్వుమన్న పవన్ వద్దని చెప్పలేదే!!
X
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు థియేటర్లలో సందడి చేస్తోంది. పరీక్షల సీజన్ తర్వాత.. సమ్మర్ ప్రారంభంలో వచ్చిన మొదటి సినిమా కావడం.. అది కూడా పవర్ స్టార్ పవర్ ఫుల్ మూవీ కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. టాక్ రకరకాలు వినిపిస్తున్నా.. వీకెండ్స్ వరకూ వసూళ్లకు ఢోకా లేదనే విషయం తెలిసిందే.

అయితే.. కాటమరాయుడు మూవీలో ఓ అంశంపై ఇప్పుడు తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రతీ సినిమా ప్రారంభంలో జాతీయ గీతాలాపన ఎలా తప్పనిసరో.. పొగాకు - మద్యాలపై హెచ్చరిక కూడా అంతే. స్టార్ హీరోల సినిమాల్లో సహజంగా ఈ హెచ్చరికలను హీరోలే చేస్తుంటారు. కానీ కాటమరాయుడులో కానీ.. దీనికి ముందొచ్చిన మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ 150లో కానీ.. స్టార్లు ఈ మాటలు చెప్పలేదు. పైగా ఈ రెండు సినిమాల్లో హీరో పాత్ర మద్యం చేస్తున్నట్లు చూపించారు. పవన్ అయితే ఏకంగా జివ్వు జివ్వు అంటూ ఓ సాంగ్ కూడా వేసుకున్నాడు.

సినిమాలో సీన్ కోసం ఇలా చేసినా.. ముందు హెచ్చరికను తానే చెప్పి ఉండాల్సింది అంటున్నారు. విలన్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ తో పొగత్రాగడం.. మద్యం త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పించారు. ఈ మాటను హీరోలే చెబితే.. కనీసం కొంతమంది అయినా ఆలోచించే అవకాశం ఉంటుంది కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/