Begin typing your search above and press return to search.

మెగా పండగలో పవర్ స్టార్ ఎక్కడ?

By:  Tupaki Desk   |   29 April 2016 12:37 PM GMT
మెగా పండగలో పవర్ స్టార్ ఎక్కడ?
X
ఏప్రిల్ 29, 2017.. మెగాస్టార్ ఇంట ఈ తేదీకి బోలెడంత ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఎనిమిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా ప్రారంభం కావడం ఒకటి విశేషం అయితే.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అంటూ ఇంటిపేరుతో రామ్ చరణ్ సొంత బ్యానర్ స్టార్ట్ చేయడం మరో విశేషం. ఈ వేడుకకు మెగాస్టార్ ఫ్యామిలీ అంతా తరలివచ్చారు. అటు అల్లు వారి కుటుంబం నుంచి కూడా బంధువులు వచ్చారు. ఇక మెగాస్టార్ మేనల్లుళ్లు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు.

అసలీ ఫంక్షన్స్ సినిమాకి సంబంధించనవే అయినా.. చిరంజీవి మాత్రం దీన్నో ప్రైవేట్ ఈవెంట్ గానే కన్సిడర్ చేశారు. అందుకే మీడియాని, అభిమానులను కూడా దూరం పెట్టారు. ఇంతమంది ఉన్నా.. అక్కడ మాత్రం ఒక లోటు కనిపించింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించక పోవడం. కొణిదెల అనే పేరుపై బ్యానర్ స్టార్ట్ చేసినపుడు కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావాలని ఆశించడంలో తప్పేం లేదు. కానీ పవన్ మాత్రం ఈ వేడుకలో భాగం కాలేదు. కారణాలు ఏమైనా.. పవర్ స్టార్ దర్శన భాగ్యం ఎవరికీ కలగలేదు.

అసలు ఇలాంటి ఈవెంట్స్ కి వచ్చే అలవాటు పవన్ కి లేదని సరిపెట్టుకుందామన్నా.. రీసెంట్ గానే సర్దార్ ఆడియో వేడుకకు మెగాస్టార్ వచ్చారు. అందుకోసమైనా అన్నయ్య సినిమా ప్రారంభ వేడుకకు పవర్ స్టార్ హాజరైతే బాగుండేదని అంతా అనుకుంటున్నారు.