Begin typing your search above and press return to search.

పవన్ సినిమాలు పక్కనెట్టేశాడట

By:  Tupaki Desk   |   22 Jan 2018 4:54 PM GMT
పవన్ సినిమాలు పక్కనెట్టేశాడట
X
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్టు కొడితే ఆయన ఎంతగా ఇష్టపడతారో తెలియదు గాని అభిమానులు మాత్రం చాలా ఆనందపడతారు. అలాగే డిజాస్టర్ అయితే కూడా అభిమానులు చాలా బాధపడతారు. కానీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా పవన్ ఫ్యాన్స్ లో ఏ మాత్రం తేడా రాలేదు. ఇంకా వారి సంఖ్య పెరుగుతూనే వచ్చింది కానీ ఏనాడూ తగ్గలేదు. ఇక రాజకీయాల్లోకి వస్తే పవన్ సినిమాలను అపెస్తాడా అనే రూమర్ అందరికి షాక్ ఇచ్చింది.

కానీ ఎవరు అంతగా నమ్మలేదు. కానీ రీసెంట్ గా పవన్ తెలంగాణ జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించి తన ప్రజాయాత్రను స్టార్ట్ చేసిన అనంతరం కరీంనగర్ కు చేరుకొని మీడియాతో సమావేశం అయ్యారు. ఈ చిట్ చాట్ లో పవన్ తాను సినిమాలను పక్కనే పెట్టేసాను అని చెప్పేశాడు. దీంతో అందరు షాక్ అవుతున్నారు. ఇప్పటికే అజ్ఞాతవాసి డిజాస్టర్ అవ్వడంతో రాజకీయాల్లోకి వెళ్లాలంటే తప్పకుండా ఒక హిట్టు కొట్టాలి అని సలహాలు ఇస్తున్నారు.

కానీ పవన్ మాత్రం ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదనే విధంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమాలను ఎప్పుడో పక్కన పెట్టేశాను అని చెప్పడం వెనుక కారణం ఏమిటి అనే సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. కానీ పవన్ మాత్రం సినిమాల ద్వారా ఓట్లు పెరగవు అనే ఆలోచనలో కూడా ఉన్నాడని మరికొందరి అభిప్రాయం. ఇంతకుముందు కందిరీగ దర్శకుడితో ఒక సినిమాను చేసే ఆలోచనలో పవన్ ఉన్నాడని టాక్ వచ్చింది. అలాగే ఏఎమ్. రత్నం నిర్మాణంలో కూడా ఓ సినిమా ఉంటుందని చెప్పారు. కానీ ఫైనల్ గా పవన్ కామెంట్స్ ఆ సినిమా ఉహలలను ఆవిరి చేసింది.