Begin typing your search above and press return to search.

''సర్దార్ సినిమాను మీరు సరిగ్గా చూడలేదు''

By:  Tupaki Desk   |   27 Aug 2016 12:30 PM GMT
సర్దార్ సినిమాను మీరు సరిగ్గా చూడలేదు
X
''నా సినిమాలను ఈ మధ్యన మీరు సరిగ్గా చూడట్లేదు. అదిగో మొన్న సర్దార్ సినిమాను మీరు సరిగ్గా చూడట్లేదు. నాక్కూడా డబ్బులు కావాలబ్బా? మీరు సినిమాలను సరిగ్గా చూడకపోతే ఎలా?'' అంటూ జోక్ చేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఈరోజు తిరుపతిలో జరిగిన జనసేన సభలో మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్న వార్నింగులు అటుంచితే.. ఇలా మధ్యలో సినిమాల గురించి జోకులు వేయడం చెప్పుకోదగిన విషయమే.

ఈ సందర్భంగా పవన్ ఒక విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. గతంలో ఆయన రాజకీయాల్లోకి వస్తే సినిమాలను మానేస్తానంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇదే విషయంపై స్పందించిన అన్నయ్య చిరంజీవి కూడా.. పవన్ కు సినిమాలను మానొద్దని చెప్పానని అన్నారు. మరి ఏ ప్రభావమో తెలియదు కాని.. ''రాజకీయాల్లో ఉంటూ.. రాజకీయం చేస్తూ.. మరో ప్రక్కన సినిమాలు చేస్తూ ఉంటా. నా దగ్గర డబ్బులేవబ్బా'' అంటూ పవన్‌ కళ్యాణ్‌ చాలా ఓపెన్ గానే చెప్పాశారు.

ఏ నిజాయితీ అయితే పవన్ అనే వాడిని ప్రజల గుండెల్లో నిలిచేలా చేసిందో.. అదే నిజాయితీతో ఇప్పుడు పవన్ తనకు డబ్బు అవసరమని.. సినిమాలు చేస్తానని చెప్పడం.. అతనిపై గౌరవం మరింత పెరిగేలా చేస్తోంది.