Begin typing your search above and press return to search.

మహాభారతం బయటకు తెచ్చిన పవన్!

By:  Tupaki Desk   |   31 May 2016 6:01 AM GMT
మహాభారతం బయటకు తెచ్చిన పవన్!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే ఎంత ఇష్టమో తెలిసిందే. సన్నిహితులందరూ ఆయన్ని ఓ పుస్తకాల పురుగు అంటూ ఉంటారు. షూటింగ్ స్పాట్ లో కూడా తన సీన్ అయిపోతే.. వెళ్లి పుస్తకం చదువుకుంటూ ఉంటాడు పవన్. ఇప్పుడు పవర్ స్టార్ కారణంగా ఓ పుస్తకం రీప్రింట్ అయిన విషయం ఇండస్ట్రీకి తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

కొన్ని రోజుల క్రితం దర్శకుడు త్రివిక్రమ్ 'ఆధునిక మహాభారతం' అనే పుస్తకాన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కొనుగోలు చేశాడు. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆ పుస్తకం.. త్రివిక్రమ్ కి విపరీతంగా నచ్చడంతో.. దాన్ని తన స్నేహితుడైన పవన్ కు పంపాడు. ఈ ఆధునిక మహాభారతం పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చడం.. ఆ రైటర్, బుక్ గురించి ఎంక్వైరీ చేయడం జరిగిపోయాయి. అయితే.. ఇంత మంచి బుక్ ఎక్కడా సేల్స్ కు అందుబాటులో లేదని తెలిసి ఆశ్చర్యపోయాడట పవన్.

ఎలాగైనా ఈ బుక్ ని మళ్లీ స్టాండ్స్ లోకి తీసుకురావాలని భావించిన పవన్ కళ్యాణ్.. ఆ రచయిత కుమారుడితో మాట్లాడి.. కొంత ఆర్థిక సాయం కూడా చేశాడట. దీంతో ఆధునిక మహాభారతం 25వేల కాపీల మేర రీప్రింట్ అయింది. ఇలా ఈ మహాభారతం మళ్లీ వెలుగు చూడ్డానికి కారణంగా పవన్ కళ్యాణ్ నిలిచాడు. తన సినిమాలు రాజకీయాలను హ్యాండిల్ చేసుకుంటూనే.. మరోవైపు తన వ్యక్తిగత ఇష్టాలపై మమకారం, అందుకోసం ఇలాంటి ఆర్థిక సాయాలు చేస్తున్న పవన్ ను ఇండస్ట్రీ జనాలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.