బన్నీతో ఫ్యాన్స్.. వివాదం లేదబ్బా

Mon Jan 09 2017 23:42:05 GMT+0530 (IST)

ఖైదీ నంబర్ 150 ఫంక్షన్ ఎంత ఆర్భాటంగా జరిగిందో.. ఆ తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంత హంగామా క్రియేట్ చేసింది. ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో.. అల్లు అర్జున్ చుట్టూ చేరి.. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ బన్నీని పవన్ ఫ్యాన్స్ ఇబ్బంది పెడుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అయింది.

అయితే.. ఈ వీడియో కేవలం ఎడిటెడ్ మాత్రమే అని.. అసలు వీడియోలో చివరి కొన్ని సెకన్లను మాత్రమే నెట్ లో ఉంచారనే విషయం ఇప్పుడు తేలిపోయింది. ఫంక్షన్ తర్వాత బన్నీ దగ్గరకు వందలాది మంది ఫ్యాన్స్ చేరిన మాట వాస్తవే కానీ.. వారంతా 'డీజే డీజే' అంటూ చాలా సేపు కేకలు పెట్టారు. డీజే- దువ్వాడ జగన్నాధం అంటూ బన్నీ చేస్తున్న ప్రస్తుత సినిమా గురించే ఎక్కువ హంగామా నడిచింది. వరుసగా హిట్స్ కొడుతున్న బన్నీ.. రాబోయే మూవీ కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఇదో నిదర్శనం. అంతే కాదు.. ఓ ఫ్యాన్ ఒక గులాబీపువ్వును బన్నీకి ఇచ్చి అభినందించాడు కూడా.

ఇదంతా అయ్యిన తర్వాత చివర్లో పవర్ స్టార్ అంటూ కొన్ని అరుపులు వినిపించాయి. దీన్ని బన్నీ కూడా స్పోర్టివ్ గానే తీసుకున్నాడు. స్టైలిష్ స్టార్ ఫేస్ లో నవ్వు చూస్తే.. పవర్ స్టార్ అరుపులను కూడా ఎంజాయ్ చేశాడనే అనిపిస్తుంది. ఇదంతా చూస్తే.. ఉద్దేశ్యపూర్వకంగానే బన్నీని టార్గెట్ చేసే ఉద్దేశ్యంతో అసలు వీడియోని ఎడిట్ చేశారనే సంగతి అర్ధమైపోతోంది.