రేణు పిక్ కి పవన్ ఫాన్స్ రియాక్షన్

Sun Jun 24 2018 19:14:24 GMT+0530 (IST)

రేణు దేశాయ్ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన పిక్ వైరల్ అయ్యాక పవన్ ఫ్యాన్ రియాక్షన్స్ ఎలా ఉంటాయా అనే దాని గురించి అందరికి ఆసక్తి కలగడం సహజం. గతంలో ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తనకు రెండో పెళ్లి చేసుకోవాలనుందని చెప్పినప్పుడు సోషల్ మీడియాలో పవన్ ఫాన్స్ చేసిన హంగామా చిన్నదేమీ కాదు. ఒకదశలో రేణు దేశాయ్ కాస్త సీరియస్ అయ్యి నా వ్యక్తిగత జీవితం నా ఇష్టం అనే తరహాలో జవాబు చెబితే తప్ప ఇష్యూ చల్లారలేదు. అయినా రేణు దేశాయ్ తన మనసులో మాటను నిజంగానే చెప్పిందన్న విషయం ఫాన్స్ కి సైతం ఈ రోజుకి పూర్తిగా అర్థమైపోయింది.ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేసిన తన పిక్ కి విషెస్ చెబుతున్నవాళ్ళు ఉండగా అదే విధంగా ఎంత పని చేసావ్ వదినమ్మ అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇకపై తనను ఏదైనా తేడాగా కామెంట్ చేసినా అకీరా గురించి జూనియర్ పవన్ అన్నా డిలీట్ చేస్తానన్న రేణు అన్నంత పని చేస్తోంది. మొత్తానికి ఒక అంకం ముగిసింది. ఇదే తరహాలో రేపో ఎల్లుండో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి కూడా అయిపోతుంది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయి. ఇక్కడ పవన్ ఫాన్స్ కానీ వేరెవరు కానీ చేసేది ఏమి లేదు. ఎన్ని మాటలు  అన్నా అవి ఆన్ లైన్ కే పరిమితమవుతాయి తప్ప అంతకు మించి చేసే సీన్ ఎవరికీ లేదన్నది వాస్తవం.

పైగా పవన్ స్వయానా వేరే వివాహం చేసుకున్నాడు కాబట్టి రేణు చేసింది తప్పని తనూ అనలేదు అనరు  కూడా. ఎవరి లైఫ్ వాళ్లదే అన్న తరహాలో పవన్ ధోరణి ఉంది కనక ఫాన్స్  రియాక్ట్ కావడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాకపోతే రేణు దేశాయ్ చేయి పట్టుకున్న ఆ వరుడు ఎవరు అన్న సస్పెన్స్ ఎప్పుడు తీరుతుందా అనే  యాంగ్జైటీ మాత్రం అందరిలో ఉంది. ఆ ముహూర్తం కూడా దగ్గరలోనే ఉంది లెండి. వెయిట్ చేసి చూద్దాం .