శ్రీరెడ్డిపై మండిపడ్డ పోలెండ్ బాలుడు!

Tue Apr 17 2018 16:22:39 GMT+0530 (IST)


జనసేన అధ్యక్షుడు - సినీ నటుడు పవన్ కల్యాణ్ పై నటి శ్రీరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేవలం పవన్ సలహా ఇచ్చిన పాపానికి...పవన్ ను శ్రీరెడ్డి అసభ్య పదజాలంతో దూషించడంపై పలువురు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు శ్రీరెడ్డికి సపోర్ట్ ఇచ్చిన వారు కూడా పవన్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యల తర్వాత ఆమెపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు పవన్ ఏ తప్పు చేయకపోయినా ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయకపోయినా ....శ్రీరెడ్డి ఈ తరహాలో బూతులు మాట్లాడడంపై పవన్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. యూట్యూబ్ - ఫేస్ బుక్ లలో శ్రీరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోలు పెడుతున్నారు. తాజాగా పోలెండ్ కు చెందిన యూట్యూబ్ సెలబ్రిటీ సింగర్ జిబిగ్న్యూ కూడా శ్రీరెడ్డిపై మండిపడ్డాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.తన అభిమాన నటుడు పవన్ ను ఒక మహిళ అసభ్యకర రీతిలో దూషించిందని అది తనకు ఎంతమాత్రం నచ్చలేదని జిబిగ్న్యూ అన్నాడు. పవన్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని చెప్పాడు. ప్రజలకు మంచి చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని అటువంటి వ్యక్తిని ఎవరు దూషించినా తనకు నచ్చదని జిబిగ్న్యూ అన్నాడు. ఇకపై పవన్ ను ఎవరూ దూషించవద్దని ఆయన అభిమానులంతా పవన్ కు మద్దతుగా ఉండాలని కోరాడు. పోలెండ్ లో పుట్టిన జిబిగ్న్యూ గతంలో చాలా తెలుగు పాటలు పాడి తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు. అతడి తండ్రి తెలుగు వాడు తల్లి పోలెండ్ వాసి. కొద్ది రోజుల క్రితం `అజ్ఞాత వాసి`లో కొడకా కోటేశ్వరరావా....పాటను జిబిగ్న్యూ పాడాడు. ఆ పాట అప్పట్లో వైరల్ అయింది.

వీడియో కోసం క్లిక్ చేయండి