పవర్ స్టార్ సినిమాలు అంతటితో సరి

Mon Jun 19 2017 14:44:53 GMT+0530 (IST)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేగం పెంచాడు. ఎన్నికలు వచ్చే సమయానికి ఫుల్ టైం పాలిటిక్స్ పై దృష్టి పెట్టాల్సి ఉండటంతో చకచకా సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంతో సాగుతోంది. ఈ సినిమా పూర్తయ్యేలోగానే మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడు. ఈ సినిమాలో మరోసారి వవర్ స్టార్ పోలీస్ రోల్ లో కనిపించనున్నాడు.

పవన్ కొత్త సినిమా కందిరీగ ఫేం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నవంబర్ నుంచి స్టార్ట్ కానుంది. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై సినిమా నిర్మించనున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన పోలీస్ సినిమాకు ఇది రీమేక్ అనే టాక్ ఉంది. అయితే ఈ సినిమా నుంచి బేసిక్ లైన్ తీసుకుని సంతోష్ శ్రీనివాస్ కొత్త వెర్షన్ రాశాడని చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమా నిర్మాత దర్శకులు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఏప్రిల్ నుంచి వెయిటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా కోసం పవన్ కేవలం 55 రోజులే కాల్షీట్స్ ఇవ్వగలనని చెప్పాడు. ఏప్రిల్ నాటికి సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో గబ్బర్ సింగ్ ఓ ప్రత్యేకమైన మైలురాయి. ఖాకీ డ్రస్సుకే కొత్త కలరింగ్ ఇస్తూ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అభిమానులను ఎంత ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు. దీని తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చేసినా అభిమానులకు అంత కిక్కివ్వలేదు. దీంతో మరోసారి పోలీస్ క్యారెక్టర్ లో అభిమానులను అలరించేందుకు పవన్ సిద్ధమైపోతున్నాడు. కానీ ఈ సినిమా తర్వాత పవన్ సినిమా చేసే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఆ తర్వాత ఫుల్ టైం పాలిటిక్స్ కే కేటాయించనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/