పాప ప్రయాణంలో కొత్త మలుపు

Wed Aug 23 2017 22:44:21 GMT+0530 (IST)

కొంతమంది హీరోయిన్లకు ఎంత ప్రయత్నించినా కూడా ఎందుకో బ్రేక్ మాత్రం రాదు. అందంగా ఉంటారు.. యాక్టింగ్ బాగానే చేస్తారు.. గ్లామర్ కూడా దారబోస్తారు.. కాని ఎందుకో లక్ కలసిరాక అసలు పెద్ద పెద్ద సినిమాలు ఒక్కటి కూడా ఖాతాలో పడవు. ఆర్య సినిమా చేసిన అనురాధ మెహ్తా.. బన్నీ సినిమాలో హీరోయిన్ మెరిసిన గౌరి ముంజాల్.. అలా రెండు మూడు సినిమాలకే మిస్సయితే.. 'ప్రయాణం' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పాయల్ ఘోష్ ఎలియాస్ హారిక మాత్రం అలా అలా సైడ్ క్యారక్టర్లకు పరిమితం అయ్యింది కూడా. అయినాసరే బ్రేక్ రాలేదు. కాని ఇప్పుడు మాత్రం సడన్ గా కెరియర్ కొత్త టర్నింగ్ తిరిగేందుకు ఒక ఛాన్సు వచ్చేసింది.అప్పట్లో హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో టూపీస్ బికినీల్లో మెరిసినా కూడా పాయల్ ఘోష్ ను టాలీవుడ్ పట్టించుకోలేదు. ఆ తరువాత ఊసరవెల్లి వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేసింది. అయినా వర్కవుట్ కాలేదు. చివరకు అప్పుడప్పుడూ చిన్ని చిన్ని దుకాణాల ఓపెనింగులో కనిపిస్తున్న ఈ భామకు చివరకు తన ప్రయాణంలో కొత్త మలుపు ఒకటి తిరిగింది. అనుకోకుండా ఇప్పుడు ''పటేల్ కి షాది'' అనే హిందీ సినిమాలో హీరోయిన్ అయిపోయింది. ఒక గుజరాతి అమ్మాయిని ఒక పంజాబి అబ్బాయి ప్రేమించడం అనే కథతో రూపొందిన ఈ సినిమాలో రిషి కపూర్ అండ్ పరేష్ రావల్ కీలక భూమిక పోషించగా.. ఆ కపుల్ గా వీర్ దాస్ అండ్ పాయల్ ఘోష్ నటించారు. ఈ దెబ్బతోనైనా అమ్మడికి ఫేట్ మారేనా? లెటజ్ సీ!!