Begin typing your search above and press return to search.

క‌ట్ట‌ప్ప‌... బాండ్‌ గా మారిపోయాడే!

By:  Tupaki Desk   |   14 Dec 2017 7:02 AM GMT
క‌ట్ట‌ప్ప‌... బాండ్‌ గా మారిపోయాడే!
X
త‌మిళంతో పాటు ప‌లు ద‌క్షిణాది భాషా చిత్రాల్లో న‌టించి సీనియ‌ర్ న‌టుడిగా పేరున్న స‌త్య‌రాజ్‌... తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్తేమీ కాదు. అయితే స‌త్య‌రాజ్‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటుగా యావ‌త్తు భార‌త సినీ జ‌నం మ‌రిచిపోలేని న‌టుడిగా గుర్తింపు ఇచ్చింది మాత్రం *క‌ట్ట‌ప్ప‌* పాత్రేన‌ని చెప్పుకోవాలి. టాలీవుడ్ జ‌క్క‌న్న ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ - రానా ద‌గ్గుబాటి పోటాపోటీగా న‌టించిన *బాహుబ‌లి* సిరీస్ చిత్రాల్లో ఆ రెండు పాత్ర‌ల‌తో పాటుగా కీల‌క‌మైన ర‌మ్య‌కృష్ణ‌ - అనుష్క షెట్టీ పాత్ర‌ల‌ను మించి స‌త్య‌రాజ్ పోషించిన క‌ట్ట‌ప్ప పాత్ర‌కే మంచి గుర్తింపు ల‌భించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంత‌కుముందు గంభీర‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌డం ద్వారా మంచి న‌టుడిగా గుర్తింపు పొందిన స‌త్య‌రాజ్‌... క‌ట్ట‌ప్ప పాత్ర‌తో ఎంత‌టి కీల‌క పాత్ర‌ల‌నైనా - ఎలాంటి విల‌క్ష‌ణ పాత్ర‌ల‌నైనా ఇట్టే ర‌క్తి క‌ట్టిస్తార‌న్న గుర్తింపు వ‌చ్చేసింది.

ఇప్పుడు స‌త్య‌రాజ్ పేరు చెబితే... అంద‌రూ క‌ట్ట‌ప్ప‌నే గుర్తు చేసుకునే ప‌రిస్థితి. అయితే క‌ట్ట‌ప్ప పాత్ర ఒక్క‌టే స‌త్య‌రాజ్‌ కు లాంగ్ లాస్టింగ్ గుర్తింపుగా ఉండేలా లేదు. ఎందుకంటే... ఇప్పుడు స‌త్య‌రాజ్ ఎంచుకుంటున్న భిన్న‌మైన పాత్ర‌లు ఆయ‌న‌ను మ‌రింతగా విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు తెచ్చిపెట్ట‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి. ఇక‌ అస‌లు విష‌యంలోకి వెళితే... ఓ మాఫియా డాన్ పాత్ర‌ను పోషించేందుకు స‌త్యరాజ్ నిర్ణ‌యించుకున్నాడు. అది కూడా కామెడీ జాన‌ర్ ఉన్న మాఫియా డాన్‌. మాఫియా డాన్‌... అది కూడా కామెడీ యాంగిల్ లో ఉందంటే... స‌త్య‌రాజ్ లుక్ ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి క‌లుగుతోంది క‌దా. అయితే ఆ లుక్ కోసం వేచి చూడాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే... *బాండ్‌* పేరుతో స‌త్య‌రాజ్ చేస్తున్న‌ కామెడీ మాఫియా డాన్ లుక్ ఇప్ప‌టికే రిలీజైపోయింది. కొత్త‌గా రిలీజైన‌‘పార్టీ’ సినిమా టీజ‌ర్ చూస్తే అందులో స‌త్య‌రాజ్ స‌రికొత్త లుక్‌ తో కిర్రెక్కిస్తున్నాడు.

‘సరోజ’ - ‘బిరియానీ’ - ‘రాక్షసుడు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ కూడా బాగానే పరిచయమున్న వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో సత్యరాజ్.. విచిత్రమైన క్యారెక్టర్ చేశాడు. ఈ పాత్రలో స‌త్య‌రాజ్‌ లుక్ నిజంగానే ఆస‌క్తిగా ఉంది. పాప్ స్టార్ తరహాలో గెటప్‌తో ఆయన ఈ చిత్ర టీజర్లో క‌నిపించాడు. ఇది డబ్బు చుట్టూ తిరిగే ఒక థ్రిల్లర్ మూవీ. ఇందులో మలయాళ హీరో జయరాంతో పాటు రమ్యకృష్ణ - జై - శివ - రెజీనా కసాండ్రా - నివేథా పెతురాజ్ కీలక పాత్రలు పోస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ఆరంభంలో - చివర్లో మోడీ డీమానిటైజేషన్ గురించి చేసిన ప్రకటన తాలూకు డైలాగులు పెట్టడం విశేషం. దీన్ని బట్టి ఈ చిత్రం డీమానిటైజేషన్ ఎఫెక్ట్ నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతోంది. చాలా వెరైటీగా.. ఉత్కంఠభరితంగా.. ఎంటర్టైనింగ్‌ గా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి.