Begin typing your search above and press return to search.

వెండితెరపై పోఖ్రాన్ అణు పరీక్షలు

By:  Tupaki Desk   |   22 Jun 2017 8:25 AM GMT
వెండితెరపై పోఖ్రాన్ అణు పరీక్షలు
X
హింది సినిమాలు ఇప్పుడు రియల్ స్టోరీస్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. హిరోయిన్లు అయితే స్త్రీ పై జరిగే అత్యాచారాలు పైన స్టార్ హీరోలు అయితే దేశం గర్వించదగ్గ మహమనుషులు పై కథలు సిద్దం చేసి నిర్మిస్తున్నారు. మరి జాన్ అబ్రహాం లాంటి కండలవీరుడు ఎలాంటి సినిమాలు తీస్తే బాగుంటుందో సరిగ్గా అలాంటి సినిమాలే తీస్తున్నాడు.

ఇంతకు ముందు చాల సినిమాలలో పోలీసు గా చేశాడు జాన్. మద్రాస్ కేఫ్ - న్యూయార్క్ లాంటి రియల్ స్టోరీస్ తో అందరినీ తన నటనతో యాక్షన్ తో అదరగొట్టిన ఇతడు ఇప్పుడు మరో రియల్ స్టోరీ ‘పరమాణు’ అనే సినిమాతో రాబోతున్నాడు. పోఖ్రాన్ అనే చిన్న పట్టణం లో ఇండియన్ ఆర్మీ జరిపిన న్యూక్లియర్ టెస్ట్ ఆధారంగా సినిమా నిర్మించబోతున్నారు. 'పోఖ్రాన్ అణు పరీక్షలు'గా మనం దీనిపై చాలా వార్తలే చదివాం. ఇప్పుడు అదే కథాంశంతో మనోడి 'పరమాణు' సినిమా రూపొందనుంది. ''1998 పోఖ్రాన్లో జరిగిన న్యూక్లియర్ పరీక్షను అక్కడ ఇండియన్ ఆర్మీ చరిత్రలో గొప్ప మైలురాయిగా మిగిలిన ఈ ప్రాజెక్టు ను ప్రేక్షకులుకు కళ్ళకుకట్టినట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం'' అంటున్నాడు జాన్. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలైందట.

జైసల్మేర్ - పోఖ్రాన్ లో 50 డిగ్రీల ఉన్న వాతావరణంలో కూడా షూటింగ్ చేయడానికి వెనకంజ వేయటం లేదట జాన్. ఆ తరువాత మంచు - వర్షం లో కూడా షూటింగ్ చేయవలిసి ఉంటుందట. ఈ సినిమా అతని జీవితంలో ఒక గొప్ప సినిమాగా నిలుస్తుంది ఫీలవుతూ చేస్తున్నాడటలే. ‘పరమాణు’ మూవీని డిసెంబర్ 8 న విడుదల చేయడానికి సిద్దం చేస్తున్నారు. ‘కాక్టైల్’, ‘హాపీ భాగ్ జయేగీ’ సినిమాలలో నటించిన డయానా పేంటీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ శర్మా ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/