పరిణితి ఎదపై చెయ్యి వేస్తే తప్పేంటి?

Tue Sep 12 2017 23:00:01 GMT+0530 (IST)

సోషల్ మీడియా ప్రపంచంలో ఈ మాద్య వాతావరణాలు ఏ మాత్రం బాగుండంలేదు. ముఖ్యంగా సెలబ్రెటీలు పోస్ట్ చేసే కొన్ని ఫోటోలు ఎలా ఉన్నా చల్లని గాలిలాంటి స్వీట్ కామెంట్స్ తో పాటు ఉరుములు మెరుపుల్లాంటి కామెంట్స్ ను క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఈ వాతావరణానికి తారలు కూడా ఒక్కోసారి సోషల్ మీడియా ప్రపంచంలో ఫొటోలు పోస్ట్ చేయాలంటేనే భయపడిపోతున్నారు.రీసెంట్ గా ఇదే తరహాలో కొన్ని ఘాటు కామెంట్స్ ని ఎదుర్కొంది బాలీవుడ్ భామ పరిణితి చోప్రా. బాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలు చేసి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం ఆస్ట్రేలియా క్వీన్స్ ఐలాండ్ దీవుల్లో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. అక్కడ స్పెషల్ గా చెప్పుకునే ఒక పార్క్ లో "కోయలా" రకం జాతి జంతువుతో అమ్మడు ఒక ఫోటోకి పోజ్ ఇచ్చింది. అయితే ఆ జంతువు కూడా ఫోటోకి చక్కగా తన స్టైల్ లుక్ ఇచ్చింది. ఫోటో బావుండంతో పరిణితి తన సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపొయింది.

కొందరు నెటిజన్స్ ఇష్టం వచ్చినట్లు వల్గర్ గా కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఫొటోలో కోయలా జంతువు తన చేతిని పరిణితి ఎదపై పెట్టడం చూసి ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కామెంట్ చేశారు. లక్కీ యానిమల్ అని అలాగే రన్ వీర్ సింగ్ పేరును కూడా ప్రస్తావించారు. రన్ వీర్ సింగ్ ఏం చేస్తున్నాడు? అతని చెయ్యి ఎక్కడ ఉందో చూడండి అని కామెంట్ చేశారు. అసలు ప్రేమతో ఓ జీవిని ఆమె ఎత్తుకొని ఉంటే.. అందుకు ప్రశంసించాల్సింది పోయిన.. ఇలాంటి కామెంట్ చేయడానికి సిగ్గులేదా అంటున్నారు మరికొంతమంది నెటిజన్స్.