Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు చబ్బీ పాప సైన్‌ చేసింది

By:  Tupaki Desk   |   9 Feb 2016 5:30 PM GMT
ఎట్టకేలకు చబ్బీ పాప సైన్‌ చేసింది
X
మరీ ఈ లెవెల్‌ డెడికేషన్‌ అండ్‌ డిటర్మినేషన్‌ ఇంకో హీరోయిన్‌ ఎవ్వరికీ ఉండదేమో. కాని మన హాట్‌ చబ్బీ బ్యూటి పరిణీతి చోప్రా మాత్రం.. చబ్బీ నుండి సెక్సీ అనిపించుకోవడానికి ఏకంగా సంవత్సరంపాటు సెలవు తీసుకుంది. ఇప్పుడు కొత్త సినిమాను సైన్‌ చేసింది.

ఇష్క్‌ జాదే సినిమాతో సూపర్‌ పాపలార్టీ సంపాదించిన పరిణీతి.. ఆ తరువాత పెద్ద హిట్లు ఒక్కటి కూడా కొట్టలేకపోయింది. ఈమె టాలెంట్‌ సూపర్‌ అంటున్నా కూడా.. హిట్లు మాత్రం పడట్లేదు. అందుకే 2014 నవంబర్‌ లో కిల్‌ దిల్ మూవీ రిలీజ్‌ అయ్యి ఫ్లాపయ్యాక.. ఇక అమ్మడు కొత్త సినిమా అనేదే సంతకం చేయలేదు. దాదాను సంవత్సరం మూడు నెలలు తరువాత ఇప్పుడు.. కొత్త అవతారంతో ముందు కవ్వించింది. వెయిట్‌ కోల్పోయి.. సన్నని మల్లెతీగలా తయారై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఎక్సయిట్మెంట్‌ లో అయుష్మాన్‌ కురానా సరసన ''మేరీ ప్యారీ బిందు'' సినిమాలో బిందు రోల్‌ చేయడానికి సంతకం పెట్టేసింది పరిణీతి.

ఈమెను వెండితెరకు పరిచయం చేసిన యశ్‌ రాజ్‌ సంస్థ.. ఈ సినిమాను నిర్మిస్తుందిలే. మరి కొత్త లుక్‌ తో కిక్కిచ్చిన పరిణీతి.. ఈ కొత్త సినిమాతో తొలి హిట్టు కొడుతుందా? 2015ను పక్కనెట్టేసిందుకు.. 2016లో ఒక హిట్టొస్తుందా? చూద్దాం.