Begin typing your search above and press return to search.

బర్త్ డే రోజున చాక్లేట్ కి పర్మిషన్

By:  Tupaki Desk   |   22 Oct 2016 5:30 PM GMT
బర్త్ డే రోజున చాక్లేట్ కి పర్మిషన్
X
బొద్దు భామ నుంచి నాజూకు సుందరిగా మారిపోయిన పరిణీతి చోప్రా.. ఇవాల్టితో 28 ఏళ్ల వయసు పూర్తి చేసుకుంటోంది. ఇవాళ అమ్మడి హ్యాపీ బర్త్ డే అని అర్ధమైపోయింది కదా. రాత్రి 12గంటలు మొదలుపెట్టేసి తెగ హంగామా చేసేస్తున్న ఈ బ్యూటీ.. తన మంచితనాన్ని కూడా బాగానే ప్రదర్శించింది. అర్ధరాత్రి తనను విష్ చేసేందుకు ఇంటికొచ్చిన ఫ్యాన్స్ ప్రతీ ఒక్కరినీ పలకరించింది. అంతేనా ఇంటి బయట పడిగాపులు పడుతున్న ఫోటోగ్రాఫర్లను కూడా తన బర్త్ డే వేడుకల్లో భాగం చేసేసి పరిణీతి ఈజ్ స్పెషల్ బ్యూటీ అనిపించేసుకుంది.

అయితే.. పుట్టిన రోజు నాడైనా ఫుల్లుగా ఎంజాయ్ చేసేసే భాగ్యం గ్లామర్ ఫీల్డ్ లో ఉండదన్నది తెలిసిన మాటే. కనీసం నోటికి నచ్చిన ఫుడ్ ని కడుపు నిండా నింపుకోలేని పరిస్థితి. అంతెందుకు.. ఓ చాకొలేట్ తినడానికి కూడా తన ట్రైనర్ యాశ్మిన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. సాధారణంగా అయితే ఈమె ససేమిరా అనేదే కానీ.. బర్త్ డే నాడు కూడా అసలు తినద్దని కండిషన్స్ పెట్టడం ఇష్టంలేక.. ఓ కండిషన్ ఫుల్ ఫిల్ చేశాక ఇచ్చిందట.

'నేను దీన్ని సంపాదించేశా. కాను లభించిన బర్త్ డే గిఫ్ట్. ' అంటూ ఆన్ లైన్ లోనే ట్వీట్ లలోనే ముద్దులు పెట్టేస్తోంది పరిణీతి. చాకొలేట్ నోట్లో పెట్టుకుని ఆవురావురుమన్నట్లుగా ఇస్తున్న పోజ్ చూస్తుంటే.. చాకొలేట్ కోసం కరువాచి పోయి ఎన్ని రోజులయిందో పాపం అన్నట్లుగా లేదూ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/