హాటీ.. ఆ పోస్ట్ ను తీసేసిందిగా!!

Wed Jan 11 2017 17:50:26 GMT+0530 (IST)

బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒకరిగా మారిపోయిన పరిణీతి చోప్రా.. ఇప్పుడు తెగ బిజీ అయిపోయింది. అటు సినిమాలు.. ఇటు ఫోటోషూట్స్ తోపాటు.. వెకేషన్స్ ను కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే ఈ బాలీవుడ్ బ్యూటీ.. తన ఎంజాయ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఈఏమె షేర్ చేసిన ఫోటో ఒకటి విమర్శలకు గురైంది. బీచ్ ఒడ్డున పరిణీతి నడుచుకుంటూ వస్తుంటే.. ఆమె అసిస్టెంట్ గొడుగు పట్టుకుని పక్కనే నడుస్తూ ఉంటాడు. అసిస్టెంట్ ను పెట్టుకునేదే హెల్ప్ కి కాబట్టి ఇందులో అభ్యంతరాలు ఏమీ ఉండవు. కానీ అతగాడు మూడు బ్యాగ్ లను మోస్తూ ఉంటాడు. వాటిలో పరిణీతి చోప్రా హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంటుంది. కనీసం హ్యాండ్ బ్యాగ్ ని కూడా మోయకుండా.. గొడుగు పట్టించుకున్న ఈ బ్యూటీపై విమర్శలు వెల్లువెత్తాయి. 'ఎంత స్టార్ అయితే మాత్రం గొడుగు కూడా మోయకూడదా..' 'గొడుగు ఓ వంద కిలోల బరువు ఉంటుందేమో' అంటూ నెటిజన్లు కౌంటర్లు వేసేశారు.

ఈ విమర్శలు ఎక్కువైపోవడంతో.. ఎందుకొచ్చిన గోలలే అనుకున్న పరిణీతి చోప్రా.. ఆ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లోంచి తీసేసింది. ప్రస్తుతం మేరీ ప్యారీ బిందు మూవీలో నటిస్తోంది పరిణీతి చోప్రా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/