Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: పేపర్ ప్రేమ బాగుందే

By:  Tupaki Desk   |   21 July 2018 5:26 AM GMT
టీజర్ టాక్: పేపర్ ప్రేమ బాగుందే
X
మాస్ సినిమాలతో రచ్చ చేసే దర్శకుడు సంపత్ నంది నిర్మిస్తున్న పేపర్ బాయ్ టీజర్ విడుదలైంది. ఎక్కువ హంగామా లేకుండా సాఫ్ట్ గా అనిపించే స్టోరీ లైన్ తో ప్రేమకథగా దీన్ని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. తాను ఇష్టపడిన అమ్మాయి కోసం పేపర్ వేస్తూ ఓ ఇంటి వంక రోజు చూసే అబ్బాయికి ఓ పెద్దింటి అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీగా దర్శకుడు జయశంకర్ దీన్ని సెన్సిబుల్ గా డీల్ చేసినట్టు టీజర్ కట్ చేసారు. బ్రతకడం కోసం పేపర్లు వేస్తూ భవిష్యత్తు కోసం బిటెక్ చేసి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉండే హీరో పాత్రలో సంతోష్ శోభన్ ఫ్రెష్ గా ఉన్నాడు. యూత్ హీరోల ట్రెండ్ గా మారిన గెడ్డంతోనే శోభన్ ఇందులో కనిపిస్తున్నాడు. దీనికి కథ రచన సంపత్ నందినే. విజువల్స్ తో ఆకట్టుకునేలా ఉన్న పేపర్ బాయ్ యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంది. రియా సుమన్ హీరోయిన్ గా పరిచయమవుతుండగా మరో పాత్ర తాన్యా హోప్ కూడా నటిస్తోంది. భీమ్స్ అందించిన మ్యూజిక్ ఆహ్లాదకరంగా ఉంది.

సౌందర రాజన్ ఛాయాగ్రహణం మంచి ఫీల్ ఇవ్వగా మొత్తానికి టీజర్ అయితే విషయం ఉన్న ఫీలింగ్ కలిగించింది. విడుదల తేదీ తదితరాలు ఇంకా ప్రకటించలేదు. న్యూస్ పేపర్ల ప్రభావం అంతగా లేదనుకుంటాం కానీ ఇప్పటికీ వీటికి చదువరులు కోట్లలో ఉన్నారు. అందుకే ఈనాడు-సాక్షి లాంటి పత్రికలు లక్షల సర్కులేషన్ తో అగ్రస్థానంలో ఉన్నాయి. సంపత్ నంది ఈ పాయింట్ తో అల్లుకున్న కథలోనే వైవిధ్యమైతే ఉంది. మరి ఈ పేపర్ ప్రేమ ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది విడుదల అయ్యాక బయటపడుతుంది.