Begin typing your search above and press return to search.

పందెంకోడి 2 బాక్సాఫీస్‌ పరిస్థితి ఇది

By:  Tupaki Desk   |   21 Oct 2018 11:55 AM GMT
పందెంకోడి 2 బాక్సాఫీస్‌ పరిస్థితి ఇది
X
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పందెంకోడి 2’ చిత్రంకు మిశ్రమ స్పందన దక్కింది. కాని వసూళ్లు మాత్రం బాగా వచ్చాయి. తమిళంలో విశాల్‌ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఠాగూర్‌ మధు 6 కోట్లకు డబ్బింగ్‌ రైట్స్‌ దక్కించుకుని విడుదల చేయడం జరిగింది. విశాల్‌ గతంలో నటించిన పందెం కోడి చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో నిర్మాత ఠాగూర్‌ మధు ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. ఆయన పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు లాభాలు కూడా రావడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.

విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం 4,21, 33, 402 షేర్‌ ను దక్కించుకుంది. ఒక వైపు ‘అరవింద సమేత’ మరో వైపు ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రాల పోటీ ఉన్నా కూడా పందెం కోడి చిత్రం మంచి కలెక్షన్స్‌ను రాబట్టడం చర్చనీయాంశం అవుతుంది. హలో గురూ ప్రేమకోసమే చిత్రం కాస్త నెగటివ్‌ టాక్‌ ను పొందింది. దాంతో మాస్‌ ఆడియన్స్‌ పందెంకోడి 2 చిత్రాన్ని ఆధరిస్తున్నారనే టాక్‌ సినీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం మరింతగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు.

తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ‘పందెం కోడి 2’ చిత్రంలో హీరోయిన్‌ గా కీర్తి సురేష్‌ నటించడంతో కూడా తెలుగు ప్రేక్షకులకు నచ్చిందని కొందరు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రాబడుతున్న కలెక్షన్స్‌ తో చిత్ర యూనిట్‌ సభ్యులు సంతృప్తిగా ఉన్నట్లుగా ఫిల్మ్‌ నగర్‌ టాక్‌ వినిపిస్తుంది. విశాల్‌ ఈమద్య కాలంలో ఇంతగా వసూళ్లు రాబట్టింది లేదు. దాంతో తెలుగులో పందెం కోడి 2 సక్సెస్‌ అయినట్లే అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.