Begin typing your search above and press return to search.

మన మల్టీప్లెక్సులన్నీ దిగదుడుపే

By:  Tupaki Desk   |   1 Dec 2015 7:52 AM GMT
మన మల్టీప్లెక్సులన్నీ దిగదుడుపే
X
హైదరాబాద్ లో మొట్టమొదటి మల్టీప్లెక్స్ ‘ప్రసాద్స్’ను చూసి అప్పట్లో మనమంతా ఆశ్చర్యపోయాం. ఆ తర్వాత పీవీఆర్ - బిగ్ సినిమాస్ - సినీ మ్యాక్స్ - జీవీకే వన్ - ఇనార్బిట్ - ఫోరమ్ లాంటి మల్టీప్లెక్స్ థియేటర్లు మరింత భారీ తనంతో సిద్ధమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా నగరాల్లోనూ సరికొత్త హంగులతో - గ్రాండియర్ తో మల్టీప్లెక్సులు తయారయ్యాయి. ఐతే మన దగ్గరున్న మల్టీప్లెక్సులైనా.. దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లోని మల్టీప్లెక్సులైనా.. చెన్నైలో కొత్తగా ఆరంభమైన ‘పలాజా’ మల్టీప్లెక్స్ ముందు వెలవెలబోవాల్సిందే. మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే చాలా తక్కువ సంఖ్యలో మాత్రం ఇలాంటి మల్టీప్లెక్సులుంటాయని అంటున్నారు దాని గ్రాండియర్ చూసి.

చెన్నైలో సినీ తారలుండే వడపల్లి ఏరియాలో కొత్తగా మొదలైన మల్టీప్లెక్స్.. పలాజా. ఐతే ఇది మల్టీప్లెక్స్ అని తెలియకుండా సడెన్ గా లోపలికి వెళ్తే మాత్రం షాకవడం ఖాయం. ఫలక్ నుమా ప్యాలెస్ తరహాలో ఓ ఇంద్రభవనంలాగా దీన్ని తీర్చిదిద్దారు యజమానులు. బాక్సాఫీస్ కానీ.. రిఫ్రెష్ మెంట్ ఏరియా కానీ.. అక్కడున్న ఫర్నీచర్ కానీ.. అన్నీ కూడా లగ్జరీకి మారు పేరులా ఉన్నాయి. ఇక స్క్రీన్ల లోపల భారీతనం కూడా మామూలుగా లేదు. సీట్ల దగ్గర్నుంచి స్క్రీన్ వరకు అన్నీ కూడా ప్రపంచ స్థాయిలో ఉన్నాయి. ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం 9 స్క్రీన్లున్నాయి. నిన్నే మొదలైన ఈ మల్టీప్లెక్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.