ఏమండోయ్... ఈ పిల్ల కోరిక విన్నారా

Wed Feb 21 2018 16:29:07 GMT+0530 (IST)

కొత్త హీరోయిన్లు... కోరికల చిట్టాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నట్టు కనిపిస్తున్నారు. ఒక్క సినిమా చేస్తారో లేదో... అప్పుడే స్టార్ హీరోలతో చేసేయాలని కలలు కంటారు. అలాంటి పిల్లే పాలక్ లల్వానీ. ఈమె టార్గెట్ ఎవరో తెలుసా? ఓ టాప్ హీరో. అతనితో నటించడమే ఆమె లక్ష్యమట.పాలక్ లల్వానీ... గతంలో అబ్బాయిలో అమ్మాయి అనే సినిమా చేసింది. ప్రస్తుతం జువ్వ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ తన గురించి చాలా విషయాలు చెప్పేసింది. తాను చాలా స్ట్రాంగ్ మహిళనని... తాను చేసే పాత్రలు కూడా అలాంటివే అయ్యేలా చూసుకుంటానని చెబుతోంది. మొదటి సినిమా ఫెయిలైనప్పటికీ... తనకు మంచి అవకాశాలే వస్తున్నాయని చెబుతోంది. తనకు అనుష్క సాయి పల్లవి - నిత్యా మీనన్ అంటే చాలా ఇష్టమని... తాను కూడా వారిలాగే మంచి కథలను ఎంపిక చేసుకుని నటించాలనుకుంటున్నానని చెప్పింది. సినిమాలలో తన లక్ష్యం ఒక్కటేనని... ఎప్పటికైనా మహేష్ బాబుతో నటించాలని కోరికగా ఉన్నట్టు చెప్పింది. ముంబై పిల్లకి అప్పుడే మన మహేషుపై కళ్లు పడ్డాయి అనుకుంటున్నారు ప్రిన్స్ అభిమానులు.

రెండు సినిమాలు చేసిందో లేదో కబుర్లు మాత్రం బాగానే చెబుతోంది అంటున్నారు సినీ జనాలు. ఎందుకు చెప్పదు.... సినీ ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన అమ్మాయి కదా. ఆమె తండ్రి జితేంద్ర లల్వానీ హిందీ సినిమాలలో నటిస్తాడు. అందుకే ఈమెకు నటన కొత్తేం కాదు. చిన్నప్పట్నించి నాన్నని టీవీలలో చూస్తూనే ఉంది. అందులోనూ పాలక్ సైకాలజీ చదివింది. కనుక ఎదుటివారిని ఇట్టే కనిపెట్టేయగలదు కూడా. ఒక పక్క చదువుతూనే మరోపక్క నటిస్తోంది పాలక్. జువ్వ తరువాత... మరో సినిమా విడుదల కాబోతోంది.