Begin typing your search above and press return to search.

ప‌క్కా లోక‌ల్ః కాజ‌ల్ చిత‌గ్గొట్టేసిందిగా..

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:30 PM GMT
ప‌క్కా లోక‌ల్ః కాజ‌ల్ చిత‌గ్గొట్టేసిందిగా..
X
ఇంకొన్ని గంట‌ల్లోనే జ‌న‌తా గ్యారేజ్ షోలు ప‌డిపోతున్నాయి. పెద్ద స్క్రీన్ మీద సినిమా సంగ‌తేంటో కానీ.. అంత‌కంటే ముందే కాజ‌ల్ అగ‌ర్వాల్ చిన్న స్క్రీన్లు చిరిగిపోయేలా చేసింది. ఇప్ప‌టికే జ‌న‌తా గ్యారేజ్ లోని మిగ‌తా పాట‌ల ప్రోమోల‌న్నీ రిలీజ్ చేసిన నిర్మాత‌లు.. సినిమా రిలీజ్ కావ‌డానికి కొన్ని గంట‌ల ముందు కాజ‌ల్ ఐటెం సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.

ఈ పాట‌లో కాజ‌ల్ ఊపు మామూలుగా లేదు. ఆ రేంజిలో ఒక ఊపు ఊపేసింది చంద‌మామ‌. కాజ‌ల్ ఇప్ప‌టిదాకా త‌న కెరీర్లో ఎన్న‌డూ వేయ‌నంత ఊపుతో డ్యాన్స్ చేసింది అంటే అతిశ‌యోక్తి ఏమీ లేదు. మొత్తంగా ఈ పాట‌లో ఎన్టీఆర్ ఎలాంటి డ్యాన్సులేశాడో కానీ.. ప్రోమోలో మాత్రం కాజ‌ల్ జోరే క‌నిపిస్తోందంతా. య‌మ స్పీడుగా స్టెప్పులేస్తూ... న‌డుం వంపుల‌తో మ‌తి పోగొడుతూ.. అందాలు ఆర‌బోస్తూ కుర్రాళ్ల‌కు కిక్కించింది కాజ‌ల్‌. స్పెష‌ల్ సెట్టింగ్ లో నైట్ ఎఫెక్ట్ లో ఈ పాట చిత్రీక‌రించారు. విజువ‌ల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. భోజ‌నానికి ముందు సూప్ లాగా ఉంది ఈ పాట‌. ఈ పాట రిలీజ‌వ‌డం ఆల‌స్యం ప‌క్కా లోక‌ల్ అనే హ్యాష్ ట్యాగ్ నేష‌న‌ల్ లెవెల్లో ట్రెండ‌వుతుండ‌టం విశేషం. సినిమా మీద అంచ‌నాల్ని మ‌రింత పెంచేలా ఉన్న ఈ పాట చూశాక.. అభిమానులు ఆగ‌డం క‌ష్టం. ఈ పాట వ‌చ్చిన‌పుడు థియేట‌ర్లు మోతెక్కిపోవ‌డం ఖాయం లాగుంది.