Begin typing your search above and press return to search.

షారుక్ కి షాకిచ్చిన పాక్ సెన్సార్ బోర్డ్!

By:  Tupaki Desk   |   26 July 2016 1:35 PM GMT
షారుక్ కి షాకిచ్చిన పాక్ సెన్సార్ బోర్డ్!
X
బాలీవుడ్ స్టార్ హీరోలు - స్టార్ హీరోయిన్స్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్ లో దూసుకుపోతుంది సన్నీ లియోన్. బాలీవుడ్ కి వచ్చిన కొత్తలో సన్నీ అంటే గ్రహాంతరవాసి అనేస్థాయిలో చూసిన కొంతమంది సినీ జనాలు.. ఇప్పుడు సన్నీని తమ తమ సినిమాల్లోకి తీసుకోవడానికి పోటీలు పడుతున్నారు. ఈ విషయంపై అమీర్ వంటి స్టార్ హీరో.. సన్నీతో నటించాలని ఉందని చెప్పడం - బాలీవుడ్ బాద్ షా తన సినిమాలో సన్నీకి ఒక స్పెషల్ ఐటం సాంగ్ ఇవ్వడం ఇందుకు తాజా ఉదాహరణలు. సన్నీ సినిమాలో ఉందంటే.. ఆ సినిమా ఓపెనింగ్స్ రూపంలో మినిమం గ్యారెంటీ వచ్చేస్తోందని చెబుతున్నారు సినీ పండితులు. ఈ రేంజ్ దో దూసుకుపోతుంది సన్నీ.

అయితే షారుక్ తన తాజా సినిమా 'రయీస్‌' కోసం సన్నీతో ఓ ఐటెం సాంగ్‌ చేయించాడు. బాలీవుడ్ బాద్ షా తో స్టెప్పులేసే అవకాశం చిన్న విషయం కాకపోవడంతో డొసు మరీ పెంచేసిందట సన్నీలియోన్. పైగా ఈ సినిమాకి కచ్చితంగా ఈ సాంగ్ స్పెషల్ అట్రాక్షనే అని చెబుతున్నారు బాలీవుడ్ సినీ జనాలు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇప్పుడు ఈ పాటతోనే షారుక్ కి సమస్య వచ్చిపడింది.

మనదేశంలో లాగానే మిగిలిన సినిమాలతో పోలిస్తే ఖాన్ త్రయం సల్మాన్ - షారుక్ - అమీర్ ఖాన్ ల సినిమాలు పాకిస్థాన్ లో కూడా రెగ్యులర్ గా విడుదలవుతుంటాయి. ఇదే క్రమంలో తన తాజా చిత్రం రయూస్ ను కూడా పాక్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బాద్ షా. అయితే పాక్ సెన్సార్ బోర్డు మాత్రం ఈ సినిమా విడుదల చేసేందుకు నిరాకరించిందట. ఆ పాటని పూర్తిగా తొలగిస్తే తప్ప తమ దేశంలో ఈ సినిమా విడుదలకి ఒప్పుకోం అని తేల్చి చెప్పిందట బోర్డు. సన్నీ అందాలు ఒక్కటి కనపడ్డా కూడా సినిమా విడుదలవ్వటానికి ఏమాత్రం ఒప్పుకునేది లేదని నిక్కచ్చిగా చెప్పేసిందట. దీనిపై పాక్ ప్రేక్షకులు మాత్రం సెన్సార్ బోర్డు నిర్ణయానికి కోపంగా ఉన్నారంటూ.. పాక్ మీడియాలో వార్తలొస్తున్నాయి. విచిత్రం కాకపోతే... సినిమా రిలీజ్ కు ఇంకా ఐదు నెలల సమయం ఉండగా ఇప్పుడే సన్నీ పాటను బ్యాన్‌ చేస్తారన్న వార్తలేమిటో.. టూమచ్ కదా!