Begin typing your search above and press return to search.

బాలీవుడ్ హీరోయిన్ ను కిడ్నాప్ చేద్దామ‌నుకున్న ప్ర‌ముఖ పాక్ పేస‌ర్!

By:  Tupaki Desk   |   15 Jun 2019 4:24 AM GMT
బాలీవుడ్ హీరోయిన్ ను కిడ్నాప్ చేద్దామ‌నుకున్న ప్ర‌ముఖ పాక్ పేస‌ర్!
X
బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే మీద త‌న‌కున్న ప్రేమ‌ను.. ఇష్టాన్ని మ‌రోసారి చెప్పుకొచ్చాడు పాక్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్. అప్ప‌ట్లో సోనాలి ఫోటోను త‌న ప‌ర్సులో పెట్టుకొని తిరిగిన ఈ పేస‌ర్.. ఆమె మీద త‌న‌కెంత ఇష్ట‌మ‌న్న విష‌యాన్ని తాజాగా నిర్వ‌హించిన షోలో వెల్ల‌డించాడు.

తాను సోనాలీని ఎంత‌గానో ఇష్ట‌ప‌డేవాడిన‌ని రావ‌ల్పిండి ఎక్స్ ప్రెస్ గా పేరున్న షోయ‌బ్ చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ బాబు దేసీ మేమ్ అనే బాలీవుడ్ చిత్రంతో ఆమెపై మ‌రింత ప్రేమ‌ను పెంచుకున్న‌ట్లు చెప్పారు. ఆ సినిమా త‌ర్వాత నుంచి ఆమె ఫోటోను ప‌ర్సులో పెట్టుకొని తిరిగేవాడిన‌ని వ్యాఖ్యానించారు.

ఒక‌వేళ త‌న ప్రేమ‌ను ఒప్పుకోక‌పోతే.. సోనాలీని కిడ్నాప్ కూడా చేయాల‌నుకున్న‌ట్లుగా చెప్పి సంచ‌ల‌నంగా మారాడు షోయ‌బ్‌. తాను సోనాలీని అప్ప‌ట్లో అంత‌గా ప్రేమించేవాడిన‌ని.. ఆమెంటే పిచ్చి ప్రేమ అంటూ పాత జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకున్నాడు షోయ‌బ్‌. ఒక క్రికెట్ ప్ర‌ముఖుడు.. ఒక బాలీవుడ్ ప్ర‌ముఖురాల్ని ఇంత‌గా ప్రేమించిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింది. కాకుంటే.. అత‌గాడి ప్రేమ వ‌న్ సైడ్ గానే ఉండిపోయింది.